వైట్ షర్ట్ లో ప్రభాస్ స్టైలిష్ లుక్.. నెట్టింట వైరల్ గా మారిన డార్లింగ్ పిక్..

First Published | May 8, 2023, 11:14 AM IST

డార్లింగ్ ప్రభాస్ (Prabhas) ఎప్పటికప్పుడు కొత్త లుక్స్ తో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. తన ప్రాజెక్ట్స్ కు తగట్టుగా మారుతున్నారు. ఈ సందర్భంగా ఓ పిక్ నెట్టింట వైరల్ గా మారింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన కేరీర్ ప్రారంభం నుంచి సినిమా సినిమాకు నయా లుక్ లో కనిపిస్తూ వచ్చారు. తన ప్రాజెక్ట్స్ కోసం ఎప్పటికప్పుడు బాడీని, హెయిర్ స్టైయిల్ ను మారుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. 
 

తాజాగా డార్లింగ్ సూపర్ లుక్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫొటోలో బ్లూ జీన్స్, వైట్ రౌండ్ నెక్, వైట్ షర్ట్ ధరించారు. వైట్ షూస్, సన్ గ్లాసెస్ పెట్టుకొని స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకున్నారు. షూటింగ్ స్పాట్ ఇలా దర్శనమిచ్చారు. 
 


అయితే, గతేడాది ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా రూపొందించిన వీడియో బైట్ కోసం డార్లింగ్ ఇలా రెడీ అయ్యారు. కాగా, సెట్స్ లోని నుంచి కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. లైక్స్, షేర్లు, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 

మొదటి నుంచి ప్రభాస్ తన నయా లుక్స్ లో ఆకట్టుకుంటూనే వచ్చారు. రీసెంట్ గా మాత్రం మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నారు. కాస్తా సన్నబడ్డ డార్లింగ్ ఎలాంటి డ్రెస్సెసిన అదిరిపోతోంది. ఎప్పటికప్పుడు తన స్టైలిష్ లుక్ లో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నారు. 

ఇక డార్లింగ్ తన ప్రాజెక్ట్స్ ను శరవేగంగా ముగిస్తున్నారు.  ప్రస్తుతం ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’ చిత్రాల్లో నటిస్తున్నారు.  రెండు చిత్రాలను పార్లల్ గా ఫినిష్ చేయబోతున్నట్టు  కనిపిస్తుంది. ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశమూ ఉంది.
 

ప్రభాస్ - ఓం రౌత్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’(Adipurush). జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. మే9న (రేపు) ట్రైలర్ ను భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. చిత్రంలో సీతగా క్రుతి సనన్ నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో కనిపించబోతున్నారు.
 

Latest Videos

click me!