'ది రాజా సాబ్' మిస్టరీ: ప్రభాస్ సినిమా వాయిదా వెనుక అసలు కథేంటి?

First Published | Dec 18, 2024, 3:23 PM IST

ప్రభాస్ నటిస్తున్న 'ది రాజా సాబ్' సినిమా వాయిదా గురించి వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 10న విడుదల కావాల్సిన ఈ సినిమా మే నెలకు వాయిదా పడే అవకాశం ఉంది. ప్రభాస్ గాయం, విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి కాకపోవడం వంటి కారణాలు చర్చించబడుతున్నాయి.

The Raja Saab Prabhas film reviews out


గత కొంతకాలంగా రెబల్ స్టార్ ప్రభాస్ స్పీడు మామూలుగా లేదు. ఆయన  చేస్తున్న సినిమాలు తెలుగులో ఏ  ఇతర స్టార్ హీరో చేయడం లేదు. ఇప్పటికే ఈ ఏడాది కల్కి తో బ్లాక్ బస్టర్ హిట్ అనుదుకున్న ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో చేస్తున్న ‘ది రాజా సాబ్’  సినిమాని  పూర్తి చేసే పనిలో ఉన్నారు.  హార్రర్‌, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. అలాగే ఏప్రిల్ 10న ఈ సినిమా విడుద‌ల కావాల్సి ఉంది. ఇప్పుడు  మే నెలాఖ‌రుకు వాయిదాప‌డొచ్చ‌ని  ప్ర‌చారం జ‌రుగుతోంది.

The Raja Saab Prabas film updates out


 రాజాసాబ్ డేట్ ప్ర‌క‌టించాక కూడా క‌న్న‌ప్ప, ఘాటి చిత్రాల‌ను ద‌గ్గ‌ర్లో రిలీజ్‌కు సిద్ధం చేయ‌డం చూస్తేనే రాజాసాబ్ అనుకున్న డేట్‌కు రాద‌నే సిగ్నల్స్ వచ్చేసాయి.  ఎందుకంటే ఆ ధైర్యం లేకపోతే యంగ్ హీరో సిద్ధు జొన్నల్లగడ్డ.. అదే తేదీకి తన కొత్త సినిమాని తీసుకొస్తున్నట్లు ప్రకటన రాదు.

 'టిల్లు' సినిమాలతో ఫేమస్ అయిన సిద్ధు.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'జాక్' మూవీ చేస్తున్నాడు. 'బేబి' వైష్ణవి చైతన్య హీరోయిన్. షూటింగ్ చివరి దశలో ఉంది. ఇ‍ప్పుడు హఠాత్తుగా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. 'రాజాసాబ్' వాయిదా గురించి వీళ్లకు క్లారిటీ ఉన్నట్లు ఉందని ఇండస్ట్రీలో వినపడుతోంది. అది గమనించే  అంత కచ్చితంగా అదే డేట్ వేశారని చెప్పుకుంటున్నారు.


The Raja Saab Prabhas film update out


అయితే 'రాజాసాబ్' వాయిదాకు ప్రధాన కారణం ప్రబాస్ గాయమే అంటున్నారు. రెండు రోజుల క్రితం చీలమండ బెణికిందని వార్త వచ్చింది. అయితే సర్జరీ చేయించుకునేందుకు త్వరలో ఇటలీ వెళ్తున్నాడని, జనవరి చివరి వారంలో ప్రభాస్ తిరిగి స్వదేశానికి వస్తాడని అంటున్నారు. అయితే అలాంటిదేమీ లేదు. కేవలం రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని, రెస్ట్ కోసమే జపాన్ పర్యటన కూడా వాయిదా వేసారని అఫషియల్ గా ప్రకటన కూడా చేసారు ప్రభాస్. 
 

Prabhas, The Raja Saab, maruthi

ది రాజా సాబ్ సినిమాకు విజువ‌ల్ ఎఫెక్ట్స్  ప్రధానం. అనుకున్న తేదికి అవి పూర్తయ్యే అవకాసం లేదని అంటున్నారు.   ప్ర‌స్తుతానికైతే టాకీ పార్ట్ పూర్తయ్యింది. మ‌రో నాలుగు పాట‌లు బాకీ ఉన్నాయి. రెండు పాట‌ల్ని హైద‌రాబాద్‌లో తెర‌కెక్కిస్తారు. జ‌న‌వ‌రిలో ఈ పాటలు షూటింగ్ ఉంటుంది. అందుకోసం సెట్స్ వర్క్ జరుగుతోంది. మ‌రో రెండు పాట‌ల్ని మార్చిలో షూట్ చేస్తారు. అందుకోసం విదేశాల్లో లొకేష‌న్ల ప్లానింగ్ జరుగుతోంది. అంటే.. మార్చి నాటికి పాట‌లు కూడా అయిపోతాయి.  

Actor Prabhas upcoming film The Raja Saab


 డైరక్టర్ మారుతి ఈ సినిమాను ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ హర్రర్‌ కామెడీ సినిమాగా తీస్తున్నారని నిర్మాత అంటున్నారు. హ్యారీపోర్టర్‌ సినిమా స్థాయిలో ఈ సినిమాలోని సన్నివేశాలు ఉంటాయంటూ చెప్తున్నారు. అలాంటి రాజాసాబ్‌ సినిమా వాయిదా పడుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు అంతా కొద్దిపాటి నిరాశే. 

Latest Videos

click me!