పవన్ కళ్యాణ్ ఓ ప్రక్కన రాజకీయాలు, పాలనతో బిజీగా ఉన్నా గ్యాప్ చూసుకుని మధ్యలో కమిటైన సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో వీలున్నప్పుడు షూటింగ్‌లకు హాజరు అవుతున్నారు. కొన్ని రోజుల క్రితం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఇటీవల 'ఓజీ' కోసం నైట్ షూట్స్ లో పాల్గొన్నారని సమాచారం. ఏదైమైనా ఆ రెండు సినిమాలను పూర్తి చేసి 2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు.
రెండు సినిమాల్లోకి ఓజీ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సాహో సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ సినిమా ఒక క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ పాత్రని తెరపై చూడటం కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది ఒక పవర్‌పుల్ గ్యాంగ్‌స్టర్ కథగా చెప్పబడుతుంది.మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో పాటు పవన్ కళ్యాణ్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటారో అలా సుజీత్ చూపించబోతున్నారు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర లో ఆసక్తికరమైన మలుపులు, కథాంశం ప్రేక్షకులను ఇంట్రస్ట్ కలిగించేలా ఉంటుంది. ఈ నేపధ్యంలో చిత్రం గురించిన ఓ విషయం బయిటకు వచ్చింది. ఈ సినిమాలో ఓ స్పెషల్ ఐటమ్ సాంగ్ ఉండబోతోంది. డీజే టిల్లు తో హాట్ టాపిక్ గా మారిన రాధిక అలియాస్ నేహా శెట్టితో సుజిత్ ఓ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేశాడట.
అయితే నేహా శెట్టి స్పెషల్ సాంగ్ లో పవన్ కళ్యాణ్ ఉంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఇప్పుడు తాను ఉన్న భాద్యతాయుతమైన పదవిలో ఐటమ్ సాంగ్స్ చేస్తారా , అయినా ఇప్పట్లో పవన్ కళ్యాణ్ డేట్లు ఇచ్చే పరిస్థితి ఉందా? అన్నది తెలియడం లేదు. అయితే అవన్నీ ప్రక్కన పెడితే నేహా శెట్టితో ఓజీలో స్పెషల్ సాంగ్ అన్న టాక్ వైరల్ అవుతోంది.
Pawan kalyan OG Glimpse
ఇదిలా ఉంటే నిర్మాతలు ఈ సినిమా ఏపీ, నైజాం ఏరియాలకు సంబంధించిన బిజినెస్ పూర్తి చేశారని తెలుస్తోంది. ఏపీ థియేట్రికల్ రైట్స్ రూ.70 కోట్లు చేసినట్లుగా సమాచారం అందుతోంది. సీడెడ్ తో కలిపి ఏపీ రైట్స్‌ని హోల్‌సేల్‌గా ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాల సమాచారం.
ఇక నైజాం ఏరియాలో 'ఓజీ' సినిమా థియేట్రికల్ రైట్స్ ద్వారా నిర్మాతకు రూ.46 కోట్లను తెచ్చి పెట్టిందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ద్వారా ఏకంగా రూ.116 కోట్లు నిర్మాత దక్కించుకున్నారని, ఇతర రైట్స్ ద్వారా మరో రూ.150 కోట్ల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి నిర్మాతకు టేబుల్ ఫ్రాఫిట్ ఖాయం అంటున్నారు.
Pawan kalyan OG Glimpse
పవన్ కళ్యాణ్ కి జోడీగా ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హస్మీ కీలక పాత్రలో నటించడం వల్ల హిందీ ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు సంగీతాన్ని థమన్ అందిస్తున్నారు. దాదాపు రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.