ప్రభాస్ నటించిన 'ది రాజా సాబ్' సినిమా మొదటి రోజే రూ. 112 కోట్లకు పైగా వసూలు చేసి గ్రాండ్ ఓపెనింగ్ సాధించింది. మూడు రోజుల్లో ..నెగటివ్ రివ్యూల ఎదురైనా.. కలెక్షన్స్ విషయంలో దుమ్మురేపుతోంది మూవీ.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వింటేజ్ లుక్, హారర్-కామెడీ జానర్ కావడంతో రాజాసాబ్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జనవరి 9న రిలీజ్ అయిన ఈసినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 112 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది.
24
3 రోజుల్లో రాజాసాబ్ ప్రపంచవ్యాప్త వసూళ్లు
వారాంతంలో వసూళ్ల వేగం తగ్గినా, 3 రోజుల ముగిసేసరికి రాజాసాబ్ కలెక్షన్లు ముఖ్యమైన మైలురాయిని చేరాయి. ఇండియాలో ప్రభాస్ సినిమా రూ. 109 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 160 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం.
34
విమర్శకులు ఏమంటున్నారంటే?
మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటించారు. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించినా, సినిమా నిడివి, వీక్ స్క్రీన్‌ప్లే కారణంగా విమర్శలు ఎదుర్కొంటోంది. అయినా సరే కలెక్షన్లు మాత్రం తగ్గడంలేదు. రెండో రోజు కాస్త పడిపోయినా.. మూడో రోజు మాత్రం సినిమా పుంజుకుంది అని చెప్పవచ్చు.
'ది రాజా సాబ్' సినిమాను రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారని టాక్. 3 రోజుల్లో రూ. 160 కోట్లు వసూలు చేసినా, లాభాలు రావాలంటే ఇంకా చాలా వసూలు చేయాలి. రాబోయే రోజుల్లోని వసూళ్లే సినిమా భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మరి సంక్రాంతి సినిమాలను దాటుకుని… ఈమూవీ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధిస్తుందా లేదా చూడాలి.