రాజా సాబ్ నెగెటివ్ టాక్.. ప్రభాస్ కోసం మారుతి మాస్టర్ ప్లాన్, సినిమాలో జరిగిన మార్పులివే..

Published : Jan 11, 2026, 02:05 PM IST

హారర్ కామెడీ సినిమా  ది రాజా సాబ్ విమర్శకుల నుంచి నెగెటివ్ రివ్యూస్ అందుకోవడమే కాకుండా, ప్రేక్షకుల నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. బాక్సాఫీస్ దగ్గర మాత్రం పర్వాలేదనిపిస్తోంది. రాాజాసాబ్ ఫ్లాప్ టాక్ తో మేకర్స్ ఓ కొత్త ప్లాన్ వేశారు.

PREV
15
ది రాజా సాబ్'కోసం కొత్త ప్లాన్ వేసిన మారుతి..

'ది రాజా సాబ్' మేకర్స్ విడుదలైన రెండో రోజే ఓ కొత్త సీన్‌ను జోడించారు. ఈ సీన్ ట్రైలర్‌లో చూపించినా, ఫైనల్ ఎడిట్‌లో తీసేశారు. ఓ అభిమాని కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని మేకర్స్ అంటున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల షో నుంచి 'ది రాజా సాబ్' కొత్త వెర్షన్ థియేటర్లలో అందుబాటులోకి వచ్చింది.

25
'ది రాజా సాబ్'లో మేకర్స్ జోడించిన సీన్ ఏది?

ట్రైలర్‌లో చూపిన ప్రభాస్ వృద్ధుడి గెటప్ సీన్‌ను సినిమాలో ఎడిట్ చేసి తీసేశారు మేకర్స్. సినిమా డ్యూరేషన్ ఇప్పటికే ఎక్కువైపోయింది. కానీ ఈసినిమాపై వచ్చిన నెగెటీవ్ టాక్ తో.. ఆసీన్ ను మళ్లీ చేర్చారు.  అది కూడా అభిమానుల  కోరిక మేరకు ఈ మార్పు చేశారు. ఈ సీన్‌లో ప్రభాస్ పైకప్పుపై తలక్రిందులుగా వేళ్లాడుతూ.. ఫైట్ చేస్తాడు.

35
డైరెక్టర్ మారుతి ఏమన్నాడంటే?

'ది రాజా సాబ్' డైరెక్టర్ మారుతి దాసరి ఈ మార్పును ధృవీకరించారు. "ప్రభాస్ అభిమానులు ఈ సినిమా విషయంలో  పూర్తిగా సంతోషంగా లేరు. ట్రైలర్‌లో చూపించిన ఓల్డ్ ప్రభాస్  గెటప్ వల్ల కథ అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. అందుకే ఆ సీన్‌ను మళ్లీ కలిపాం " అని ఆయన అన్నారు.

45
ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఫైట్ సీన్?

ఈ సినిమాలో పైకప్పుపై చేసే ఫైట్ సీన్ అద్భుతంగా ఉంటుందని డైరెక్టర్ మారుతి అన్నారు. సర్వర్ సమస్యల వల్ల ముందు తొలగించినా, ఇప్పుడు సరిచేసి.. సినిమాలో కలిపామని అన్నారు. ఈ సినిమా మొత్తానికి ఇది హైలెట్ అవుతుందన్నారు. అంతే కాదు మునుపెన్నడు ఎవరు చేయని విధంగా దీన్ని డిజైన్ చేేశామని మేకర్స్ వెల్లడించారు. 

55
'ది రాజా సాబ్' రన్‌టైమ్ ఎంత?

ప్రభాస్, సంజయ్ దత్ నటించిన 'ది రాజా సాబ్' రన్‌టైమ్ 189 నిమిషాలు (3 గంటల 10 నిమిషాలు). కొత్త సీన్ జోడించినా రన్‌టైమ్‌లో పెద్దగా మార్పు ఉండదని మేకర్స్ చెప్పారు. ఈ సినిమాలో జరీనా వహాబ్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లాంటి స్టార్స్ సందడి చేశారు. 

Read more Photos on
click me!

Recommended Stories