ఇదిలా ఉంటే `ప్రాజెక్ట్ కే` సినిమాకి సంబంధించిన కథలో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. ఇందులో ప్రభాస్, దీపికా పదుకొణెల పాత్రలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు బయటకు లీక్ అయినట్టు తెలుస్తుంది. ఇందులో బిగ్ బీ, ప్రభాస్ తండ్రీ కొడుకులుగా నటించబోతున్నారని, అమితాబ్ అశ్వద్ధామ అని, ఆయనో పెద్ద వ్యాపార వేత్త అని, ఆయనకు సహాయకురాలి పాత్రలో దీపికా పదుకొణె నటించబోతోందని సమాచారం.