ప్రస్తుతం ప్రియమణి చేతినిండా సినిమాలు ఉన్నాయి. హిందీ, కన్నడ, తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో ‘సైనేడ్’అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. దాదాపు ఆరేండ్ల తర్వాత ప్రియమణి బిజీయేస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే, ప్రియమణికి చిత్రాల ద్వారా వచ్చిన ఫేమ్ కంటే.. ఢీ షోతోనే ఎక్కువ పాపులారిటీ వచ్చిందని చెప్పాలి. తెలుగు, తమిళం, మలయాళంలో ఢీషోలకు జడ్జీగా ఎంతో మంది టీవీ ప్రేక్షకులకు దగ్గరైంది.