శ్రియ రెడ్డి మాట్లాడుతూ... ప్రశాంత్ నీల్ చిత్రాల్లో కాస్ట్యూమ్స్ డార్క్ కలర్స్ లో ఉంటాయి. సలార్ లో కూడా బ్లాక్, గ్రే, ఆలివ్ గ్రీన్ కలర్స్ వాడారు. నాకు కూడా అదే రంగు కాస్ట్యూమ్స్ రూపొందించారు. ఓ సన్నివేశంలో ఎల్లో కలర్ చీర అయితే బాగుంటుందని నేను సూచించాను. అందుకు ప్రశాంత్ నీల్ ఒప్పుకోలేదు. అయితే ప్రశాంత్ నీల్ తో వాదించి పసుపు రంగు చీర ధరించాను, అని ఆమె అన్నారు.