ప్రభాస్ తో స్నేహం చెడిందా ?.. అది కష్టం అనిపించే దూరమయ్యా, ప్రభాస్ శ్రీను కామెంట్స్ వైరల్

Published : Nov 17, 2023, 03:19 PM IST

వర్షం, చక్రం పౌర్ణమి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ ఇలా చాలా చిత్రాల్లో ప్రభాస్ శ్రీను కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. ప్రభాస్, ప్రభాస్ శ్రీను స్నేహం కొనసాగుతూ వచ్చింది. అయితే ఇటీవల ప్రభాస్ కి ప్రభాస్ శ్రీను దూరం అయ్యాడని పుకార్లు వినిపించాయి.

PREV
16
ప్రభాస్ తో స్నేహం చెడిందా ?.. అది కష్టం అనిపించే దూరమయ్యా, ప్రభాస్ శ్రీను కామెంట్స్ వైరల్

కొందరు నటులు తాము నటించిన చిత్రాల ద్వారా పాపులర్ అవుతారు. తాము చెప్పిన డైలాగ్ ద్వారా పాపులర్ అవుతారు. ఉదాహరణకు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ. ఆ డైలాగ్ పృథ్వీ ఇంటి పేరుగా మారిపోయింది. చాలా మంది నటులకు, నిర్మాతలకు, దర్శకులకు వారు చేసిన చిత్రాలు ఇంటి పేర్లుగా మారిపోవడం చూశాం. 

 

26

కానీ కమెడియన్ ప్రభాస్ శ్రీను పరిస్థితి వేరు. ప్రభాస్ తో స్నేహం వల్ల ఆ పేరే శ్రీను ఇంటిపేరుగా మారిపోయింది. ప్రభాస్, ప్రభాస్ శ్రీను ఇద్దరూ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో స్నేహితులు అనే సంగతి తెలిసిందే. వర్షం మొదలుకుని ప్రభాస్ చాలా చిత్రాల్లో ప్రభాస్ శ్రీను నటించాడు. 

 

36

వర్షం, చక్రం పౌర్ణమి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ ఇలా చాలా చిత్రాల్లో ప్రభాస్ శ్రీను కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. ప్రభాస్, ప్రభాస్ శ్రీను స్నేహం కొనసాగుతూ వచ్చింది. అయితే ఇటీవల ప్రభాస్ కి ప్రభాస్ శ్రీను దూరం అయ్యాడని పుకార్లు వినిపించాయి. ఇద్దరి మధ్య స్నేహం చెడినట్లు చాలా వార్తలు వచ్చాయి. 

 

46

తాజాగా ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీను ఆ రూమర్స్ కి వివరణ ఇచ్చాడు. నేను ఇండస్ట్రీకి వచ్చింది నటుడిగా రాణించేందుకు. ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ప్రభాస్ తో పరిచయం ఏర్పడి అది స్నేహంగా మారింది. మా ఇద్దరి మధ్య స్నేహం బాగా కుదిరింది. అయితే ప్రభాస్ తో ఏదో లెక్కలు వేసుకుని ఫ్రెండ్ షిప్ చేయలేదు. ప్రభాస్ కి నా బిహేవియర్ నచ్చడంతో దగ్గర పెట్టుకున్నారు. 

 

56

ప్రభాస్ తో ఉన్నప్పుడు కొన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. ఆ విషయంలో నాకు ఎలాంటి బాధ లేదు. కానీ గబ్బర్ సింగ్ లో నటించిన తర్వాత నాకు ఆఫర్స్ బాగా పెరిగాయి. ఆఫర్స్ పెరగడంతో సినిమాల్లో నటించడం.. ప్రభాస్ తో ఉంటూ ఆయన పనులు చూసుకోవడం కాస్త కష్టమైంది. 

 

66

షూటింగ్ లో బిజీగా గడుపుతూ ప్రభాస్ అప్పగించిన పని చేయడం కష్టం కదా. అందుకే మిర్చి తర్వాత సినిమాలకు పూర్తిగా సమయం కేటాయించాలనుకున్నా. ఈ విషయాన్నీ ప్రభాస్ కి కూడా చెప్పా. నటన అంటే నాకు ఇష్టం కాబట్టి ఫుల్ టైం సినిమాలపై ఫోకస్ చేయమన్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే వచ్చి కలవమన్నాడు. గతంలో లాగా ప్రభాస్ దగ్గర లేకున్నప్పటికీ.. మా ఇద్దరి స్నేహం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది అని ప్రభాస్ శ్రీను క్లారిటీ ఇచ్చారు.  

 

click me!

Recommended Stories