ప్రభాస్.. నాగార్జున, అన్నమయ్య సినిమాల గురించి రియాక్ట్ అయ్యారు. ఓ ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావుతో తనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు ప్రభాస్. నాగార్జునకి, అన్నమయ్యకి సింక్ కుదరడం లేదన్నాడు. మరి ఇంతకి ఏం జరిగింది, ఆయన ఏం చెప్పాడంటే.. `అన్నమయ్య` సినిమా రిలీజ్ అయి పెద్ద హిట్ అయ్యింది. అప్పటి వరకు ప్రభాస్ సినిమా చూడలేదట. నాగార్జున ఏంటి అన్నమయ్య సినిమా చేయడమేంటి, మనసులో సింక్ కుదరడం లేదట. ఏదో ఉంటుందిలే అనుకుని తన ముస్లీం ఫ్రెండ్‌తో కలిసి సినిమాకి వెళ్లారట. అది చూసి షాక్, మైండ్ బ్లోయిన్, అరెస్ట్ అయిపోయారట.