సినిమాలు కాదు ఫ్యామిలీనే ముఖ్యం.. ప్రభాస్‌ సంచలన నిర్ణయం.. ?

Published : Sep 16, 2022, 05:47 PM ISTUpdated : Sep 16, 2022, 06:32 PM IST

పాన్‌ ఇండియా స్టార్‌, డార్లింగ్‌ ప్రభాస్‌ పెదనాన్న కృష్ణంరాజు మరణాంతరం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలు కాదు, కుటుంబమే ముఖ్యమనే నిర్ణయానికి వచ్చారు. 

PREV
16
సినిమాలు కాదు ఫ్యామిలీనే ముఖ్యం.. ప్రభాస్‌ సంచలన నిర్ణయం.. ?

ప్రభాస్‌కి పెద్ద దిక్కు పెదనాన్న కృష్ణంరాజు. రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు నట వారసుడు కూడా ప్రభాసే. వీరి రెండు కుటుంబాలకు కూడా కృష్ణంరాజే పెద్ద దిక్కు. అలాంటి ఆయన ఇటీవల హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. దీంతో ప్రభాస్‌, కృష్ణంరాజు ఫ్యామిలీలు షాక్‌లోకి వెళ్లాయి. టాలీవుడ్‌ సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. సినీ రాజకీయ ప్రముఖులు ప్రభాస్‌ ఫ్యామిలీని ఓదార్చుతున్నాయి. 

26
Rip Krishnam Raju

అన్నింటికి పెద్ద దిక్కుగా ఉన్న కృష్ణంరాజు మరణించడంతో వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఇప్పట్లో కోలుకోలేని పరిస్థితి నెలకొంది. కృష్ణంరాజుకి ముగ్గురు కూతుళ్లు. భార్య శ్యామలాదేవి ఉన్నారు. వారంతా ఒంటరైపోయారు. ఇలాంటి టైమ్‌లో వారికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ బాధ్యత ఇప్పుడు ప్రభాస్‌ తీసుకుంటున్నారు. పిన్ని, చెల్లెళ్లకి సంబంధించిన అన్ని విషయాలు ప్రభాసే లీడ్‌ చేయాల్సి ఉంది. 
 

36

ప్రభాస్‌కి ఇప్పుడు పెద్ద బాధ్యత పడింది. ఇన్నాళ్లు పెదనాన్నే అన్నీ చూసుకుంటున్న నేపథ్యంలో డార్లింగ్‌ ఫ్రీగా ఉన్నారు. ఇప్పుడు ఆయనే లేకపోవడంతో ఆ బాధ్యత ప్రభాస్‌ వంతు అయ్యింది. అందుకే ప్రభాస్‌ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారట. సినిమా షూటింగ్‌లు సైతం పక్కన పెట్టి ఫ్యామిలీకి టైమ్‌ ఇవ్వాలని, వారిలో ధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత తీసుకుంటున్నారట. 
 

46

అందులో భాగంగా కొన్నాళ్లపాటు షూటింగ్‌లకు దూరంగా ఉండాలనుకుంటున్నారట ప్రభాస్‌. మొదట వెంటనే సినిమా షూటింగ్‌ల్లో పాల్గొనాలని అనుకున్నారట. తాను నటించే సినిమాలన్నీ భారీ బడ్జెట్‌ చిత్రాలు. స్టార్స్ కాల్షీట్లతో కూడిన వ్యవహారం, నిర్మాతకి భారీగా నష్టం వాటిల్లుతుంది. పైగా స్టార్స్ డేట్స్ దొరకడం కష్టమవుతుంటుంది. దీంతో షూటింగ్‌ల్లో పాల్గొనాలని ముందుగా నిర్ణయించుకున్నారట. కానీ ఇంట్లో వారి పరిస్థితి చూసి, ఇలాంటి కష్ట సమయంలో మనం అండగా నిలవాల్సిందనే అభిప్రాయానికి వచ్చారట. 
 

56
Prabhas

దీంతో నెల రోజుల పాటు ప్రస్తుతం తాను నటిస్తున్న `ప్రాజెక్ట్ కే`, `సలార్‌` చిత్రాల షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చినట్టు తెలుస్తుంది. నెల రోజులపాటు షూటింగ్‌లు వాయిదా వేయాలని కోరినట్టు టాక్‌. ఇంట్లో ఈ లోపు జరగాల్సిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని, తనే అన్ని పనులు చూసుకోవాలనకుంటున్నారట. ప్రస్తుతం ఈ విషయం ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 
 

66

ప్రస్తుతం ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్ కే`, `సలార్‌`, `ఆదిపురుష్‌` చిత్రాలున్నాయి. `ప్రాజెక్ట్ కే`కి నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తుండగా, దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తుంది. అమితాబ్‌ బచ్చన్ కీ రోల్‌ చేస్తున్నారు. టైమ్‌ పీరియడ్‌తో ఈ చిత్రం రూపొందుతుందట. మరోవైపు ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో `సలార్‌` తెరకెక్కుతుంది. అలాగే `ఆదిపురుష్‌ చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. మరోవైపు మారుతితో చేయాల్సి సినిమా సైతం త్వరలో ప్రారంభం కాబోతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories