Prabhas Desire: ప్రభాస్‌కి ఎంత మంది పిల్లలు కావాలో తెలుసా? అమ్మాయిలో ఈ ఒక్క క్వాలిటీ ఉంటే చాలు పెళ్లికి రెడీ

Published : Jul 21, 2026, 12:11 PM IST

ప్రభాస్‌ యాభై ఏళ్లకు దగ్గరలో ఉన్నాడు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎప్పుడు చేసుకుంటాడో తెలియదు. కానీ పెళ్లి, పిల్లలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎంత మంది పిల్లలు కావాలో కూడా చెప్పాడు. 

PREV
15
పాన్‌ ఇండియా హీరోగా రాణిస్తోన్న ప్రభాస్‌

ప్రభాస్‌.. రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చాడు. `ఈశ్వర్‌`తో హీరోగా పరిచయమై `వర్షం` చిత్రంతో తొలి బ్రేక్‌ అందుకున్నాడు. స్టార్‌ అయిపోయాడు. `ఛత్రపతి` తో తిరుగులేని స్టార్‌గా ఎదిగాడు. `డార్లింగ్‌`, `మిస్టర్‌ పర్‌ఫెక్ట్`, `మిర్చి`, `బాహుబలి` చిత్రాలతో తన స్థాయిని పెంచుకుంటూ ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు గ్లోబల్‌ మార్కెట్‌ పై కన్నేయడం విశేషం. పలు భారీ చిత్రాలతో అలరించేందుకు వస్తున్న ప్రభాస్‌ ఎవరికీ లేని భారీ లైనప్‌తో   బిజీగా ఉన్నాడు.

25
47ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోని ప్రభాస్‌

ప్రభాస్‌ ప్రస్తుతం ఏజ్‌ 47 ఏళ్లు. ఇంకా పెళ్లి చేసుకోలేదు మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌గా రాణిస్తున్నాడు. కానీ పెళ్లి ఊసే లేదు. వాళ్ల పెద్దమ్మ శ్యామలాదేవి మాత్రం పెళ్లి కావాలని దేవుడి గుళ్లు తిరుగుతుంది. ప్రభాస్‌ గ్రీన్‌ సిగ్నల్‌ కోసం వెయిట్‌ చేస్తున్నామని, అమ్మాయిని చూస్తున్నామని చెబుతూ అసలు విషయాన్ని దాట వేస్తుంది. మరి ప్రభాస్‌ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో క్లారిటీ లేదు. అసలు పెళ్లి చేసుకుంటాడా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

35
అరెంజ్‌ మ్యారేజ్‌ చేసుకుంటా- ప్రభాస్‌

ఈ క్రమంలో ప్రభాస్‌.. మంచు లక్ష్మీ టాక్‌ షోలో పాల్గొన్నాడు.  ఇందులో ఆయన పెళ్లి, పిల్లలపై స్పందించారు. బుజ్జిగాడు సినిమా తర్వాత టైమ్‌లో ఈ ఇంటర్వ్యూ జరిగింది. ఇందులో ఆయన పెళ్లి గురించి ఓపెన్‌ అయ్యాడు. పెళ్లి ఎప్పుడు అని లక్ష్మీ అడిగితే, ఇప్పుడే తెలియదు, ఇంకా ఏం అనుకోలేదు, ఏడాది, రెండేళ్లు, ఎంతైనా పట్టొచ్చు అని తెలిపాడు. అలాగే లవ్‌ మ్యారేజా, అరెంజ్‌ మ్యారేజా అని అడిగితే అరెంజ్‌ మ్యారేజే ని తెలిపారు. అమ్మా నాన్నకి నచ్చితే చాలు అని చెప్పాడు.

45
అమ్మాయిలో ఉండే లక్షణాలు, పిల్లలపై ప్రభాస్‌ కామెంట్‌

అయితే తనకు ఎలాంటి అమ్మాయి కావాలని అని అడిగితే.. ఆర్టిఫిషీయల్‌గా ఉండకూడదు అని చెప్పాడు ప్యూర్‌ సోల్‌(స్వచ్ఛమైన మనసు) ఉండాలని తెలిపాడు ప్రభాస్‌. అలాంటి అమ్మాయి అయితే చాలు పెళ్లి చేసుకోవడానికి అని తెలిపారు. మరి ఎంత మంది పిల్లలు కావాలని అని అడగ్గా, తనకు పెద్దగా ఫాంటసీ ఏం లేదని, కాకపోతే ఇద్దరు పిల్లలు కావాలని తెలిపారు. ఒక్కరు అయితే ఒంటరిగా ఉండిపోతారని, ఇద్దరైతే బాగుంటుందని తెలిపాడు ప్రభాస్‌. అయితే ఈ ఇంటర్వ్యూ ఇచ్చి దాదాపు 20 ఏళ్లకుపైగానే అవుతుందని చెప్పొచ్చు. కానీ ఇప్పటి వరకు ఆయన మ్యారేజ్‌ చేసుకోకపోవడం గమనార్హం.

55
ప్రభాస్‌ చేస్తున్న సినిమాలు

ఇక ప్రభాస్‌ `బాహుబలి` చిత్రాలతో పాన్‌ ఇండియా హీరోగా ఎదిగాడు. `సలార్‌`, `కల్కి 2898 ఏడీ` చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. చివరగా ఆయన `ది రాజా సాబ్‌` వంటి డిజాస్టర్‌ని అందించాడు. ఇప్పుడు `ఫౌజీ`, `స్పిరిట్‌` చిత్రాల్లో నటిస్తున్నాడు. దీంతోపాటు `కల్కి 2` కూడా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్ర షూటింగ్‌లో ఆయన పాల్గొనాల్సి ఉంది. దీనికి టైమ్‌ పట్టేలా ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories