Nagarjuna: లెనిన్‌ విషయంలో నాది కూడా తప్పే.. ఒడిస్సీతో పోల్చుతూ మేకర్స్, ఇండస్ట్రీకి నాగార్జున చురకలు

Published : Jul 21, 2026, 09:50 AM IST

అఖిల్‌ హీరోగా నటించిన `లెనిన్‌` మూవీ హిట్‌ అయిన నేపథ్యంలో నాగార్జున ఇండస్ట్రీకి చురకలు అంటించారు. `లెనిన్‌` విషయంలో తనది కూడా తప్పే అని ఒప్పుకున్నారు.

PREV
16
ఇండస్ట్రీకి, మేకర్స్ కి నాగార్జున చురకలు

అఖిల్‌ హీరోగా రూపొందిన `లెనిన్‌` మూవీ ఈ నెల 10న విడుదలై విజయవంతంగా రన్‌ అవుతుంది. రెండో వారంలోనూ మంచి జోరు చూపిస్తోంది. పది రోజుల్లో అదిరిపోయే కలెక్షన్లని సాధించింది. ఇప్పటికే థియేట్రికల్‌గా బ్రేక్‌ ఈవెన్‌ అయ్యింది. దీంతో సోమవారం బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్‌ నిర్వహించింది టీమ్‌. ఇందులో నాగార్జునతోపాటు నాగచైతన్య, `లెనిన్‌` మూవీ టీమ్‌ కూడా పాల్గొంది. ఇందులో నాగార్జున మాట్లాడుతూ ఇండస్ట్రీకి, మేకర్స్ కి చురకలు అంటించారు. రిలీజ్‌ డేట్‌ విషయంలో మనం ఎందుకు ముందు ఉండటం లేము అని ప్రశ్నించారు. `లెనిన్‌` విషయంలో తనది కూడా తప్పే ఉందన్నారు.

26
ఒడిస్సీ మూవీ రిలీజ్‌ డేట్‌ ఏడాది క్రితం ప్రకటించారు

నాగార్జున మాట్లాడుతూ, `రెండు వారాల ముందే పోస్ట్ ప్రొడక్షన్ టీంకి ఇస్తే అద్భుతంగా సినిమాని బయటకు తీసుకు వస్తారు. అందరూ రెండు వారాల ముందే సినిమాని పోస్ట్ ప్రొడక్షన్ టీంకి ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకప్పుడు మేం రిలీజ్ కంటే ఒక నెల ముందే పూర్తి కాపీని చూసేవాళ్లం. `నిన్నే పెళ్లాడతా`, `అన్నమయ్య` సినిమాల టైమ్‌లో రెండు నెలల ముందే ఫైనల్‌ కాపీ చూసుకునేవాళ్లం. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. మొన్న వచ్చిన `ఒడిస్సీ` సినిమాని ఏడాది ముందే రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. అనుకున్న టైమ్‌కి తీసుకొచ్చారు. కానీ మనం అనుకున్న డేట్‌కి తీసుకురాలేకపోతున్నాం.

36
రెండు వారాల ముందే సినిమా ఇవ్వాలి

`లెనిన్‌` సినిమాని మొదట జూన్‌ లో అని ప్రకటించాం. ఆ తర్వాత వాయిదా వేశాం. రెండు సార్లు పోస్ట్ పోన్‌ చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో నా తప్పు కూడా ఉంది. అదే సమయంలో దర్శకులు, ఇతర టెక్నీషియన్లు, మ్యూజిక్‌ డైరెక్టర్లు ఇలా అందరు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ దిశగా పనిచేయాలి. ఇండస్ట్రీ మొత్తం ఈ విషయాన్ని గుర్తించాలి. కనీసం రెండు వారాల ముందు అయినా సినిమాని ఫినిష్‌ చేస్తే చూసుకోవడానికి, ఇంకా బెటర్‌గా చెక్కడానికి, ట్రిమ్‌ చేయడానికి, సినిమాని బాగా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా అందరు వర్క్ చేయాలి, అలా ప్లాన్‌ చేసుకొని సినిమాలు చేయాలి. అప్పుడే సినిమా బాగుంటుంది` అని తెలిపారు నాగార్జున. ఇది తన సలహా అని ఆయన వెల్లడించారు.

46
లెనిన్‌ సక్సెస్‌తో ఇంట్లో పండగ వాతావరణం

నాగార్జున ఇంకా మాట్లాడుతూ, `లెనిన్‌` సినిమా విజయం మా ఇంట్లో పండగ వాతావరణం తీసుకొచ్చింది. నేను అఖిల్‌, చైతూ ఒక పండగలా ఫీలవుతున్నాం. ఈ విజయానికి అభిమానులకే కారణం. వాళ్ల క్లాప్స్ కోసం అఖిల్‌ ఇన్నాళ్లుగా వెయిట్‌ చేస్తున్నాడు. ఇప్పటికి దొరికింది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను పిలిచి షీల్డ్స్ ఇవ్వడం అనేది అప్పుడెప్పుడో సెలెబ్రేట్ చేసుకునేవాళ్లం. ఇప్పుడు మళ్లీ ‘లెనిన్’ కోసం ఇలా నిర్వహిస్తుండటం ఆనందంగా ఉంది. ప్రతీ చోటా ఇంకా హౌస్ ఫుల్స్ పడుతున్నాయని చెబుతుంటే ఆనందంగా ఉంది. రైటర్ సత్యానంద్ గారు ఈ కథకు ఇచ్చిన ఇన్ పుట్స్ ఎంతో సహాయపడ్డాయి. రామజోగయ్య శాస్త్రి గారితోనూ పాటల గురించి ఎంతో మాట్లాడాం. మా అన్నపూర్ణ పోస్ట్ ప్రొడక్షన్ టీం అద్భుతం అని చెప్పాలి. శివాజీ బాగా చేశాడు, ఆర్టిస్ట్ లు అంతా అదరగొట్టారు. టెక్నీషియన్లు తమ బెస్ట్ ఇచ్చారు. ఇలా టీమ్‌ అందరికి ధన్యవాదాలు. నేను ఒక సినిమా హిట్‌ అనేది రివ్యూలు, పబ్లిక్‌ టాక్‌ని కాదు, అభిమానుల ఫోన్‌ కాల్స్ కాదు, డిస్ట్రిబ్యూటర్లు చెప్పేది నమ్ముతాను. వాళ్ల నుంచి పాజిటివ్‌ కాల్‌ వస్తే అప్పుడు హిట్‌గా భావిస్తాను. ఈ సినిమాకి అలాంటి కాల్స్ చాలా వచ్చాయి` అని చెప్పారు నాగార్జున.

56
నాన్న ఫైర్‌ ఎలా ఉంటుందో నాకు, అఖిల్‌కే తెలుసు

నాగ చైతన్య మాట్లాడుతూ .. ‘మాకు సపోర్ట్ చేస్తున్న అక్కినేని అభిమానులందరికీ ధన్యవాదాలు. తమ్ముడు కాస్త లేట్‌గా వచ్చినా.. అభిమానులు మాత్రం లేటెస్ట్‌గా సపోర్ట్ చేశారు. ఈ కథకి ఓకే చెప్పిన వెంటనే అఖిల్ సక్సెస్ కొట్టాడని ఫిక్స్ అయ్యాను. లెనిన్ కారెక్టర్‌కి, అఖిల్‌కి ఎలాంటి సంబంధం ఉండదు. కానీ లెనిన్ పాత్ర కోసం అఖిల్ పూర్తిగా మారిపోయాడు. ఓ అన్నయ్యగా, అభిమానిగా అఖిల్‌ను చూస్తే ఎంతో గర్వంగా ఉంది. నాన్న గారి ఫైర్ ఏ రేంజ్‌లో ఉంటుందో నాకు, అఖిల్‌కి మాత్రమే తెలుసు. నాన్న చేసిన డేరింగ్ స్టెప్స్‌తో ‘శివ’, ‘అన్నమయ్య’, ‘నిన్నే పెళ్లాడుతా’ వంటి చిత్రాలు వచ్చాయి. అలానే ఈ ‘లెనిన్’ను అంతే డేరింగ్‌గా తీసి చూపించారు. ఇలా షీల్డ్ ఫంక్షన్ చేసి చాలా రోజులైంది. మళ్లీ ఇలా ‘లెనిన్’ మూవీకి చేస్తుండటం ఆనందంగా ఉంది` అని చెప్పారు.

66
మూడు రోజుల్లోనే లెనిన్‌ బ్రేక్‌ ఈవెన్‌

అఖిల్ అక్కినేని మాట్లాడుతూ, ``లెనిన్` గురించి చాలా మాట్లాడేశాం. రెండో రోజు నుంచే మాకు థియేటర్లు పెంచి సపోర్ట్ చేసిన డిస్ట్రిబ్యూటర్లకు థాంక్స్. మూడు రోజుల్లోనే ‘లెనిన్’ బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. సీవీ రావ్, పోస్ట్ ప్రడక్షన్ టీంకి, రజినీ గారికి, రాంబాబు, ఆనంద్ ఇలా సినిమాకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా కోసం వచ్చిన అక్కినేని అభిమానులకు థాంక్స్. అన్నయ్యకి థాంక్స్’ అని అన్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories