భారీ బడ్జెట్ లో పకడ్బందీ ప్లాన్ తో నాగ అశ్విన్ ఈ చిత్రాన్ని అంతర్జాతీయ హంగులతో తెరకెక్కిస్తారని భావించారు. ఇప్పటి వరకు హంగామా అలాగే జరిగింది. ఫస్ట్ టీజర్ రిలీజ్ కోసమే భారీ ఖర్చుతో సాన్ డిగో లో ప్లాన్ చేశారు. దీనితో నాగ అశ్విన్ హాలీవుడ్ ని తలదన్నే చిత్రాన్నే ప్లాన్ చేస్తున్నారు అని అంతా భావించారు. దీనికితోడు కనివిని ఎరుగని విధంగా కమల్ హాసన్, అమితాబ్, దీపికా పదుకొనె, దిశా పటాని లాంటి స్టార్స్ నటిస్తున్నారు.