అలాగే యూఎస్ లోనూ ప్రీ సెల్స్ కలెక్షన్స్ లక్షా 75 వేల డాలర్స్ దాటినట్టు సమాచారం. అడ్వాన్స్ బుక్కింగ్స్ కూడా ఓపెన్ ఉండటంతో మంచి రెస్సాన్స్ వస్తోంది. ప్రస్తత బిజినెస్ చూస్తుంటే రాధే శ్యామ్ డే వన్ ఓవర్సీస్ కలెక్షన్ రికార్డు స్థాయిలో ఉంటోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రేమకి, విధికి మధ్య సాగే ఈ చిత్రానికి రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ ఫిల్మ్ పతాకంపై నిర్మాతలు వంశీ, భూషణ్ కుమార్, ప్రమోద్, ప్రసీదలు నిర్మిస్తున్నారు.