హీరోయిన్ గా, అక్కగా, వదినగా, అమ్మగా, ఇప్పుడు అమ్మమ్మగా కూడా నటిస్తోంది జయసుధ. కాగా ఆమెతో పాటు ఓ సినిమాలో నటించిన స్టార్ హీరో.. ఆమెకంటే 20 ఏళ్ళదాకా చిన్నవాడైన హీరో జయసుధను పెళ్లాడతా అన్నాడట. అది స్వయంగా వెళ్లి.. జయసుధ భర్త నితిన్ కపూర్ తో చెప్పాడట ఇంతకీ ఆ హీరో ఎవరు.. ఎందుకు అలా చెప్పాడో తెలుసా..?
రజినీకాంత్ కూతురితో జయం రవి పెళ్ళి..? కొత్త బాంబ్ పేల్చిన సెలబ్రిటీ..
నువ్వు పెళ్లి చసుకోకాని.. మే 17న మాత్రమే పెళ్లి చేసుకోమని అన్నాడట. దాంతో ఆ మాట విన్న జేడీ కి ఏం అర్ధం కాలేదట. ఆతరువాత నితిన్ కపూర్ చెప్పిన లాజిక్ విని చక్రవర్తి షాక్ అయ్యాడట. ఇంతకీ ఏంటా లాజిక్ అంటేు.. ఆ డేట్ తమ పెళ్లి రోజు అని, ఆ రోజు పెళ్లి చేసుకుంటే.. పెళ్లి డేట్ అదే ఉంటుంది. భర్తలు మాత్రం మారతారని సరదాగా అన్నాడట నితిన్. ఈ విషయాన్ని జేడీ చక్రవర్తి స్యయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
జయసుధతో కలిసి కోన్నిసినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు జేడీ. ఆటైమ్ లో ఆమెతో ఒకే కుటుంబంలో ఉండేవారట.ఇక జేడీ చక్రవర్తి మూవీ కెరీర్ గురిచం చూస్తే.. మనీ మనీ, గులాబి, దెయ్యం, బాంబే ప్రియుడు ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన జేడీ చక్రవర్తి.. తెలుగులోక్రేజీ హీరోగా ఎదిగాడు. మరీముఖ్యంగా.. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సత్య సినిమా.. జేడీకి బాలీవుడ్ లో మస్త్ ఇమేజ్ ఇచ్చింది.
రాను రాను హీరోగా అవకాశాలు తగ్గడంతో.. విలన్ గా మారిపోయాడు జేడీ చక్రవర్తి. కొన్ని సినిమాల్లో విలన్ గా, కొన్ని సినిమాల్లో కాంబినేషన్ హీరోలతో కలిసి సందడి చేశాడు. కేవలం నటుడిగానే కాకండా దర్శకుడిగా మెగాఫోన్ పట్టి సినిమాలు కూడా తెరకెక్కించాడు. ఇక ప్రస్తుతం జేడీ చక్రవర్తి సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నాడు.