టాప్ 10 పాన్ ఇండియా స్టార్స్ వీరే... ఆర్ ఆర్ ఆర్ హీరోలకు బిగ్ షాక్!

Published : Jun 06, 2024, 10:33 AM IST

పాన్ ఇండియా ఫీవర్ నడుస్తుండగా... టాప్ 10 పాన్ ఇండియా హీరోలు ఎవరో తేలిపోయింది. ప్రముఖ సంస్థ జరిపిన సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్ హీరోలు రేసులో వెనకబడ్డారు.   

PREV
18
టాప్ 10 పాన్ ఇండియా స్టార్స్ వీరే... ఆర్ ఆర్ ఆర్ హీరోలకు బిగ్ షాక్!
Top 10 Pan India Stars


ఎవరు నెంబర్ వన్ అనేది ఎప్పుడూ ఆసక్తికరమే. ఇక పాన్ ఇండియా హీరోల రేసు రసవత్తరంగా మారింది. ఈ మధ్య సినిమాకు భాషా బేధాలు తొలగిపోయాయి. సౌత్ అతిపెద్ద చిత్ర పరిశ్రమగా అవతరించింది. కాగా దేశంలోనే నెంబర్ వన్ హీరో ఎవరో ఓ సంస్థ సర్వే ద్వారా చెప్పింది. 
 

28

బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ సర్వే ప్రకారం... షారుఖ్ ఖాన్ పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన గత ఏడాది హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు. పఠాన్, జవాన్ వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. డంకీ సైతం హిట్ టాక్ తెచ్చుకుంది. 
 

38

ఇక రెండో స్థానంలో ప్రభాస్ నిలిచాడు. ప్రభాస్ గత చిత్రం సలార్ బ్లాక్ బస్టర్ కొట్టింది. ఆ మూవీ రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాగే కల్కి ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్న నేపథ్యంలో ఆయన ప్రభాస్ రెండో స్థానం కైవసం చేసుకున్నారు. 
 

48

కోలీవుడ్ స్టార్ విజయ్ మూడో స్థానంలో ఉన్నాడు. ఆయన గత చిత్రం లియో భారీ విజయం అందుకుంది. గోట్ త్వరలో విడుదల కానుంది. 
 

58


సూపర్ స్టార్ మహేష్ కి టాప్ 5 లో చోటు దక్కడం విశేషం. ఆయనకు నాలుగో స్థానం దక్కింది. రాజమౌళితో సినిమా వార్తలు నేపథ్యంలో ఆయన క్రేజ్ అమాంతం పెరింది. 
 

68

టాప్ 5 లో చోటు దక్కించుకున్న మరో హీరో అక్షయ్ కుమార్. ఆయన నటించిన బడే మియా చోటే మియా ఇటీవల విడుదలైంది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా అక్షయ్ కుమార్ తన క్రేజ్ నిరూపించుకున్నాడు. 
 

78

ఇక సల్మాన్ ఖాన్ ఆరో స్థానంలో హృతిక్ రోషన్ ఏడవ స్థానంలో నిలిచారు. ఈ ఇద్దరు బడా హీరోలకు ఇది షాక్ అనడంలో సందేహం లేదు. 

 

88
Top 10 Pan India Stars

టాలీవుడ్ స్టార్స్ అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ చివరి మూడు స్థానాల్లో నిలిచారు. అల్లు అర్జున్ కి ఎనిమిదవ స్థానం దక్కింది. ఎన్టీఆర్ తొమ్మిదవ స్థానంలో, రామ్ చరణ్ పదవ స్థానంలో నిలిచారు. ఆర్ ఆర్ ఆర్ హీరోలకు కనీసం టాప్ 5లో చోటు దక్కలేదు. 

Read more Photos on
click me!

Recommended Stories