సౌందర్య సొంత మేనమామని ప్రేమించిందా?.. ఎవరికీ తెలియని సహజనటి లవ్‌ స్టోరీ

Published : Jun 06, 2024, 09:39 AM ISTUpdated : Jun 06, 2024, 08:24 PM IST

సౌందర్య హీరోలతో ప్రేమలో పడిందనే రూమర్స్ వచ్చాయి. కానీ ఆమె మనసులో మరో వ్యక్తి ఉన్నాడట. సౌందర్య ప్రేమించిన అసలు వ్యక్తి వేరే ఉన్నాడట.   

PREV
16
సౌందర్య సొంత మేనమామని ప్రేమించిందా?.. ఎవరికీ తెలియని సహజనటి లవ్‌ స్టోరీ

సౌందర్య.. అద్భుతమైన సహజనటి, అందాల తార. సావిత్రి తర్వాత అంతటి విలక్షణమైన నటన కనబరిచిన నటి సౌందర్య మాత్రమే అని చెప్పొచ్చు. ఆమె ఓ సాఫ్ట్ వేర్‌ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందు హీరోలతో ఎఫైర్‌ ఉందనే వార్తలు వచ్చాయి. 
 

26

సౌందర్య.. వెంకటేష్‌తో ఎక్కువ సినిమాలు చేయడం వల్ల ఆయనతో ప్రేమలో ఉందనే పుకార్లు వచ్చాయి. కానీ అవి పుకార్లుగానే మిగిలాయి. అలాగే జగపతిబాబుతోనూ ప్రేమలో పడిందన్నారు. జగపతిబాబు కూడా తమ మధ్య రిలేషన్‌ని బయటపెట్టాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నామని తెలిపారు. 
 

36

కానీ ఇవన్నీ కాదు, ఓ షాకిచ్చే విషయం, ఎవరికీ తెలియని మరో కొత్త లవ్‌ స్టోరీ బయటకు వచ్చింది. సౌందర్య నిజంగానే ఓ వ్యక్తిని ప్రేమించిందట. అది ఎవరో కాదు, తమ అమ్మ సోదరుడే అట. మేనమామని ప్రేమించిందట సౌందర్య. ఈ విషయాన్ని సౌందర్యనే చెప్పిందట. సీనియర్‌ నటి నిర్మల వెల్లడించారు. ఐడ్రీమ్‌ ఇంటర్వ్యూలో ఆమె ఈ షాకింగ్‌ నిజాన్ని బయటపెట్టారు. 

46

వెంకటేష్‌తో నటించిన `జయం మనదేరా` సినిమా షూటింగ్‌ కోసం స్విట్జర్లాండ్‌కి వెళ్లారట. అక్కడకి సౌందర్య అమ్మ రాలేదు. నటి నిర్మల ఉన్నారట. దీంతో ఆమెతో క్లోజ్‌గా మూవ్‌ అయ్యారట ఆ సమయంలోనే లోలోపల పాట పడుతూ జాలీగా కనిపించారట. ఏ దొంగ ఏదో రహస్యం దాస్తున్నారని చెప్పగా, అసలు విషయాన్ని బయటపెట్టిందట సౌందర్య. 
 

56

అది 2000 ఏడాది. జయం మనదేరా షూటింగ్‌లో సౌందర్య ఓపెన్ అయ్యిందట. తాను ప్రేమిస్తున్నది ఎవరో కాదు, తన మేనమామనే అని చెప్పిందట. అమ్మ తమ్ముడితోనే ప్రేమలో ఉందట. అంతేకాదు సౌందర్యలో చాలా డ్రీమ్స్ ఉన్నాయట. పిల్లలు, ఎలా లైఫ్‌ లీడ్ చేయడం వంటివి చాలా డిస్కస్‌ చేసిందట. తనకి ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయట. లైఫ్‌పై చాలా ఆశలున్నాయని తెలిపింది. కానీ అంతలోనే విషాదం చోటు చేసుకుందని తెలిపింది నటి నిర్మల.
 

66

సౌందర్య మరణించే నాటికి ఆమె ప్రెగ్నెంట్‌ అని తెలిపింది. 2003లో సౌందర్య సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్‌ జీ ఎస్‌ రఘుని పెళ్లి చేసుకుంది. మ్యారేజ్‌ తర్వాత కొన్ని నెలల్లోనే ఆమె విమాన ప్రమాదంలో కన్నుమూయడం అత్యంత బాధాకరం.  అయితే సౌందర్య ప్రేమించిన మేనమామ, ఈ సాఫ్ట్ వేర్‌ రఘు ఒక్కరేనా అనేది డౌట్‌. అయితే ప్రమాదం నాటికి సౌందర్య ప్రెగ్నెంట్‌ అని, అతను ఎవరో కాదు మదర్‌ బ్రదర్‌ అని తెలిపింది నటి నిర్మల. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతుంది. మరి దీనికి సంబంధించి మరింత క్లారిటీగా తెలియాల్సి ఉంది.  
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories