Prabhas, ఎన్టీఆర్‌, చరణ్‌ కాంబోలో కృష్ణంరాజు బ్లాక్‌ బస్టర్‌ రీమేక్‌.. ప్రభాస్‌ పెద్దమ్మ డ్రీమ్‌

Published : Jan 10, 2026, 04:23 PM IST

ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తే ఎలా ఉంటుంది. కృష్ణంరాజు సతీమణి, ప్రభాస్‌ పెద్దమ్మ ఒక అద్భుతమైన డ్రీమ్‌ని క్యారీ చేస్తుంది. తాజాగా ఆ విషయాన్ని బయటపెట్టింది 

PREV
15
ది రాజా సాబ్‌తో అలరిస్తోన్న ప్రభాస్

ప్రభాస్‌ ప్రస్తుతం `ది రాజా సాబ్‌` చిత్రంతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఈ మూవీ ఈ శుక్రవారమే ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. కానీ బాక్సాఫీసు వద్ద మొదటి రోజు మంచి వసూళ్లని సాధించింది. వంద కోట్లు చేసిందని ట్రేడ్‌ సైట్లు ప్రకటించాయి. చిత్ర బృందం మాత్రం రూ.112కోట్లుగా తేల్చింది. ఇదిలా ఉంటే ప్రభాస్‌ కి సంబంధించిన తన డ్రీమ్‌ ని వెల్లడించింది పెద్దమ్మ శ్యామలాదేవి.

25
ప్రభాస్‌ పెళ్లి ఆలోచనల్లో శ్యామలాదేవి

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి ఇప్పుడు ప్రభాస్‌ పెళ్లి చేసే పనిలో ఉంది. ఆమె ఇటీవల గుళ్లు గోపురాలు తిరిగింది. కానీ ప్రభాస్‌ చేతిలో ఐదారు సినిమాలున్నాయి. ఇప్పట్లో ఆయన పెళ్లి చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో శ్యామలాదేవి ప్రభాస్‌ సినిమాలకు సంబంధించిన తన కోరికని బయటపెట్టింది. తన డ్రీమ్‌ ప్రాజెక్ట్ ఒకటి ఉందట. భారీ మల్టీస్టారర్ మూవీ చేస్తే బాగుండని, ఎప్పుడూ ఆ ఆలోచనలో ఉంటుందని చెప్పింది శ్యామలాదేవి.

35
మనవూరి పాండవులు మూవీ రీమేక్‌

కృష్ణంరాజు నటించిన హిట్‌ మూవీస్‌లో `మనవూరి పాండవులు` మూవీ పెద్ద హిట్‌. చిరంజీవికి ప్రారంభంలో మంచి గుర్తింపు తెచ్చిన చిత్రమిది. ఇందులో కృష్ణంరాజు హీరో. సినిమాలో ఆయన పాత్రనే చిరంజీవి, మురళీమోహన్‌ వంటి కుర్రాళ్లలో పోరాట స్ఫూర్తిని రగిలిస్తారు. అప్పట్లో విశేషంగా ఆదరణ పొందిన ఈ మూవీ అంటే శ్యామలాదేవికి ఇష్టమట. అయితే ఇప్పుడు ఈ మూవీ రీమేక్‌ చేస్తే చూడాలని ఉందని చెప్పింది ప్రభాస్‌ పెద్దమ్మ.

45
ప్రభాస్‌, ఎన్టీఆర్‌, చరణ్‌లు హీరోలుగా మల్టీస్టారర్‌

ప్రభాస్‌.. కృష్ణంరాజుగారి మూవీస్‌లో `మనవూరి పాండవులు` మూవీని రీమేక్‌ చేస్తే చూడాలని ఉందని ఆమె వెల్లడించింది. ఇప్పుడు ప్రభాస్‌, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ఇలా అంతా కలిసి ఈ మూవీ చేస్తే అద్భుతంగా ఉంటుంది.  కానీ అది ఎంత వరకు అవుతుందో ఏమో అని చెప్పింది. ఇప్పుడు ప్రభాస్‌, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా హీరోలుగా రాణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీరు ముగ్గురు కలిసి సినిమా చేయడం అసాధ్యం. ఆ మధ్య ఎన్టీఆర్‌, చరణ్‌ కలిసి చేసిన `ఆర్‌ఆర్‌ఆర్‌` విషయంలోనే ట్రోల్స్ నడిచాయి. మరి ఈ ముగ్గురుని హ్యాండిల్‌ చేయడం చాలా కష్టం. ఊహించడం కూడా కష్టం. కానీ ఊహ మాత్రం అదిరిపోయింది. ఒకవేళ ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తే మాత్రం అది ఇండియన్‌ సినిమాల్లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ కాబోతుందని చెప్పొచ్చు.

55
ప్రభాస్‌, ఎన్టీఆర్‌,చరణ్‌ ప్రస్తుతం చేస్తోన్న సినిమాలు

ఇక ప్రభాస్‌ లేటెస్ట్ మూవీ `ది రాజాసాబ్‌` థియేటర్లలో సందడి చేస్తుండగా, ప్రభాస్‌ ప్రస్తుతం `ఫౌజీ`, `స్పిరిట్‌` చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆ తర్వాత కల్కి 2`, `సలార్‌ 2`, ప్రశాంత్‌ వర్మ మూవీస్‌ చేయాల్సి ఉంది. మరోవైపు రామ్‌ చరణ్‌ ప్రస్తుతం `పెద్ది` సినిమాలో నటిస్తున్నారు. ఇది మార్చిలో విడుదల కానుంది. అలాగే సుకుమార్‌ మరో స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నారు. ఎన్టీఆర్‌ ఇప్పుడు `డ్రాగన్‌` మూవీలో నటిస్తున్నారు. అనంతరం త్రిక్రమ్‌తో సినిమా ప్లాన్‌ ఉంది. అలాగే నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌తోనూ ఓ మూవీ ఉందని సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories