ప్రభాస్ నుంచి ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రాలేదు. రాజా సాబ్ విడుదల కావాల్సి ఉన్నా వాయిదా పడింది. రాజా సాబ్ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. రాజాసాబ్ నుంచి ప్రభాస్ నటిస్తున్న సినిమాల బిజినెస్ ఏ స్థాయిలో ఉందో ఈ కథనంలో తెలుసుకోండి.
రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని పరిగణించబడే స్థాయికి చేరిపోయారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ వందల కోట్ల బిజినెస్ తో ముడిపడి ఉన్నాయి. కృష్ణం రాజు నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగారు. ప్రభాస్ చివరగా నటించిన సినిమా కల్కి 2898 ఎడి. ఈ చిత్రం 1000 కోట్లకి పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
27
ఈ ఏడాది ప్రభాస్ నుంచి నో మూవీ
ఈ మూవీ 2024లో రిలీజ్ అయింది. ఇక ఈ ఏడాది ప్రభాస్ నుంచి ఒక్క సినిమా కూడా రాకపోవడం అభిమానులకు నిరాశ కలిగించే అంశం. రాజా సాబ్ చిత్రం పలుమార్లు రిలీజ్ వాయిదా పడడంతో ప్రభాస్ క్యాలెండర్ లో 2025 ఖాళీగా మారింది. మొత్తానికి ప్రభాస్ హంగామా 2026 సంక్రాంతి నుంచి మొదలవుతుంది. 2025లో ప్రభాస్ నుంచి ఎలాంటి మూవీ రాలేదు కానీ.. ప్రభాస్ పేరుపై ప్రస్తుతం 4000 కోట్ల బిజినెస్ ఉంది. ఇండియాలో ఏ ఇతర స్టార్ హీరోకి సాధ్యం కానీ ఫీట్ ఇది. ఒక్క హీరోని నమ్మి ఏకంగా 4 వేల కోట్ల బిజినెస్ ఉండడం అనేది మామూలు విషయం కాదు. ప్రభాస్ సినిమాలపై ట్రేడ్ లో ఉన్న క్రేజ్ కి ఇది నిదర్శనం. ఆ సినిమాల వివరాలు ఇప్పుడు చూద్దాం.
37
ది రాజా సాబ్
డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రం తెరకెక్కుతోంది. సుదీర్ఘంగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతూనే ఉంది. అందుకే రిలీజ్ ఆలస్యం అయింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ ఈ చిత్రంతో తన స్టైల్ లో వినోదం అందించబోతున్నారు. ప్రభాస్ కామెడీ టైమింగ్ బావుంటుంది. భారీ బడ్జెట్ చిత్రాల కారణంగా ప్రభాస్ లోని ఫన్ యాంగిల్ ని అభిమానులు మిస్ అవుతూ వచ్చారు. రాజా సాబ్ మూవీ హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ 350 కోట్ల వరకు జరిగే అవకాశం ఉంది.
హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కూడా 2026లోనే రిలీజ్ కాబోతోంది. సో 2026లో ప్రభాస్ అభిమానులకు డబుల్ ధమాకా ఖాయం. ఇది బ్రిటిష్ టైం పీరియడ్ లో తెరకెక్కుతున్న పీరియడ్ వార్ యాక్షన్ డ్రామా. భారీ బడ్జెట్ లో రూపొందుతోంది. ఈ చిత్ర బిజినెస్ 500 కోట్ల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి.
57
స్పిరిట్
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ చిత్రం రీసెంట్ గా ప్రారంభమైంది. ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. ఈ రిలీజ్ కి ముందే కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్న చిత్రం ఇది. తప్పకుండ ఈ చిత్ర బిజినెస్ 1000 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంతా అంచనా వేస్తున్నారు.
67
సలార్ పార్ట్ 2
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ 1 మంచి విజయం సాధించింది. దీనితో సలార్ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. పార్ట్ 2 ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియదు కానీ ఈ చిత్రానికి 800 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది.
77
కల్కి పార్ట్ 2
భవిష్యతులో ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ లో కల్కి 2 కూడా ఉంటుంది అని చెప్పడం లో సందేహం లేదు. ఎందుకంటే కల్కి మొదటి భాగం సాధించిన విజయం.. చివర్లో పార్ట్ 2కి లీడ్ చేసేలా ముగించిన విధానం ఈ సినిమాని ప్రత్యేకంగా నిలిపాయి. ఈ మూవీలో కర్ణుడిగా ప్రభాస్ చేసిన విధ్వంసాన్ని జస్ట్ శాంపిల్ చూపించారు. పార్ట్ 2లో అది ఏ రేంజ్ లో ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి 2 బిజినెస్ తప్పకుండా 1200 కోట్ల రేంజ్ లో ఉంటుంది.
ఈ చిత్రాల బిజినెస్ మొత్తం కలుపుకుంటే 3850 కోట్ల నుంచి 4000 కోట్ల వరకు ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.