ప్రస్తుతం 'వీరమల్లు' సినిమాతో బిజీగా ఉన్న దర్శకుడు క్రిష్, ప్రభాస్ హీరోగా ఒక కథను సిద్ధం చేశారట. 'బాహుబలి' నిర్మాతలైన శోభు యార్లగడ్డ - ప్రసాద్ దేవినేనికి ఆ కథను వినిపించగా, వారు ముందుకు వచ్చినట్టుగా బలమైన ప్రచారమైతే జరుగుతోంది. ప్రభాస్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా చెబుతున్నారు.