ప్రభాస్ సినిమా కోసం భారీ సెట్, పక్కా ప్లానింగ్ తో మారుతి, షూటింగ్ ఎప్పుడు..?

Published : Apr 12, 2022, 12:50 PM ISTUpdated : Apr 12, 2022, 12:51 PM IST

జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు యంగ్ రెబ్ స్టార్ ప్రభాస్, రాధేశ్యామ్ రిజల్ట్ తో సినిమాల విషయంలో జాగ్రత్త పడాలని చూస్తున్నాడు. త్వరలో మరో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం భారీ సెట్స్ రెడీ అవుతున్నట్టు సమాచారం.   

PREV
15
ప్రభాస్ సినిమా కోసం భారీ సెట్, పక్కా ప్లానింగ్ తో మారుతి, షూటింగ్ ఎప్పుడు..?

వరుసగా సినిమాలు చేస్తున్నాడుప్రభాస్. ఇప్పటికే రాధేశ్యామ్ రిలీజ్ అయ్యింది. ఇక నెక్ట్స్ సలార్ , ఆదిపురుష్ షూటింగ్స్ చివరిదశలో ఉన్నాయి. వీటితో పాటు సందీప్ కిషన్ తో స్పిరిట్ మూవీ ప్రకటిచిన ప్రభాస్.. మారుతీతో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. ఈసినిమాపై రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. 

25

 ప్రస్తుతం మారుతి గోపీచంద్ హీరోగా  పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు.ఈ మూవీ రిలీజ్ కు  ముస్తాబవుతోంది. జులై 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విడుదల కాగానే, ఆ తరువాత ప్రభాస్ ప్రాజెక్టుపై మారుతి పూర్తి దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది.

35

ప్రభాస్ హీరోగా మారుతి  చేయబోయే సినిమాకు రాజా డీలక్స్ టైటిల్ లాంచనమే అని తెలుస్తోంది. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఓ భారీ అప్ డేట్ వినిపిస్తుంది.  ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ ను వేయిస్తున్నారట. చాలా వరకూ ఈ సినిమా షూటింగ్ అందులోనే జరగబోతున్నట్టు సమాచారం. దాదాపు షూటింగ్ అంతా అందులోనే ప్లాన్ చేస్తుండటంతో.. ఈసెట్ కోసం భారీగా ఖర్చు చేయబోతున్నారట మేకర్స్.

45

ఈ సినిమా పై మారుతి గట్టిగానే కసరత్తు చేస్తున్నాడట. ప్రభాస్ తో సినిమా అది కూడా భారీ బడ్జెట్ సినిమా కావడంతో తాను ఒక్కడే కాకుండా  తన తోటి రచయితల .. దర్శకుల సూచనలను కూడా తీసుకుంటున్నట్టుగా సమాచారం. హారర్ కామెడీ నేపథ్యంలో నడిచే ఈ సినిమా కోసం ప్రభాస్ 40 రోజుల కాల్షీట్స్  మాత్రమే ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకు తగినట్టుగానే  ప్రబాస్ పార్ట్ షింగ్ ను కంప్లీట్ చేసేలా ముందే ప్లాన్ చేసుకుంటున్నారట. 
 

55

ఇక ఈసినిమాలో ముగ్గురు హీరోయిన్లు  ఉండనున్నారని సమాచారం.ఇప్పటికే రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కృతి శెట్టి, శ్రీలీలా లాంటి కొత్త తరం తారల పేర్లు కూడా వినిపించాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ను కూడా డిఫరెంట్ గా చూపించబోతున్నట్టు సమాచారం. 
 

Read more Photos on
click me!

Recommended Stories