ప్రభాస్ - మారుతీ సినిమా నుంచి కొత్త లుక్.. డార్లింగ్ ను ఇలా తెర మీద చూస్తే..

First Published | Oct 15, 2023, 5:12 PM IST

ప్రభాస్ - మారుతీ కాంబోలోని సినిమాపై ఇప్పటి వరకు అఫీషియల్ అప్డేట్ అందలేదు. కానీ బ్యాక్ టు బ్యాక్ పిక్స్ మాత్రం వైరల్ అవుతూ వస్తున్నాయి. తాజాగా లీకైన పిక్స్ లో ప్రభాస్ లుక్ మాత్రం అదిరిపోయింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  సినిమాల కోసం దేశ వ్యాప్తంగా ఆడియెన్స్ ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సందర్భంగా ప్రభాస్ కు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ నైనా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
 

అయితే ప్రస్తుతం ప్రభాస్  ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాల్లో నటిస్తున్నారన్నది అధికారికంగా తెలిసిన విషయమే. ఈ చిత్రాల అప్డేట్స్ కూడా అఫీషియల్ గా అందుతూనే ఉన్నాయి. భారీ అంచనాలూ నెలకొన్నాయి. ఇప్పటికే అందించిన అప్డేట్స్ తో వరల్డ్ వైడ్ గా డిమాండ్ కూడా ఏర్పడింది. 
 


ఇక ప్రభాస్ లైనప్ లో ఉన్న మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను దర్శకుడు మారుతీ డీల్ చేస్తున్నారన్న విషయం తెలిసిందే. కాగా, ఈ చిత్రం గురించి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అప్డేట్ ఇవ్వలేదు. కనీసం అనౌన్స్ మెంట్ కూడా చేయలేదు. కానీ షూటింగ్ మాత్రం జరుగుతున్నట్టు తెలుస్తోంది. అందుకు కారణం కొన్ని ఫొటోలు లీకవ్వడం.
 

సెట్స్ నుంచి డార్లింగ్ లుక్ లీకవ్వడంతో అభిమానులు చిత్రీకరణ జరుగుతోందని కన్ఫర్మ్ అవుతున్నారు. అఫీషియల్ అప్డేట్ కూడా ఇస్తారని ఆశిస్తున్నారు. కానీ ఇప్పటివరకు అలాంటి న్యూస్ అందలేదు. కానీ తాజాగా సెట్స్ నుంచి ప్రభాస్ మరో  కొత్త ఫొటోలు లీకయ్యాయి. నెట్టింట వైరల్ గా మారింది. 
 

ఈ ఫొటోల్లో ప్రభాస్ చాలా హ్యాడసమ్ గా కనిపిస్తున్నారు. సెట్స్ లో ఏదో యాక్షన్ సీన్ ను చిత్రీకరిస్తున్నట్టు కనిపిస్తోంది. కలర్ ఫుల్ క్యాస్ట్యూమ్ లో డార్లింగ్ లుక్ అదిరిపోయింది. చాలా బ్యూటీఫుల్ గా, వింటేజ్ లుక్ తో కనిపించారు. ఇలానే వెండితెరపై డార్లింగ్ ను చూస్తే అభిమానులకు పండగే. 
 

ప్రభాస్ సినిమాల కోసం అభిమానులతో పాటు సాధారణ ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అధికారిక అప్డేట్స్ రాకపోవడంతో ఇలా లీకైన పిక్స్ తోనే ఫ్యాన్స్ సరిపెట్టుకుంటున్నారు. సినిమాపై ఆశలు పెంచుకుంటున్నారు. నెక్ట్స్ ‘సలార్’ రిలీజ్ కాబోతోంది. నెక్ట్స్ ఈయర్ జనవరిలో ‘కల్కి 2898 ఏడీ’ రాబోతున్న విషయం తెలిసిందే. 
 

Latest Videos

click me!