ప్రభాస్ న్యూ లుక్ అదిరిందిగా.. క్యాప్, గాగుల్స్ లో డార్లింగ్ నయా ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడే.!

Published : Aug 15, 2022, 02:59 PM IST

ఇండియాను షేక్ చేసే కటౌట్ ఉన్నా.. డార్లింగ్ ప్రభాస్ అప్పుడప్పుడు హ్యాండ్సమ్ లుక్ తో ఆకట్టుకుంటుంటాడు. అయితే నెట్టింట పాన్ ఇండియా స్టార్ నయా లుక్ వైరల్ అవుతోంది. క్యాప్, గాగుల్స్ పెట్టుకున్న ప్రభాస్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు.  

PREV
16
ప్రభాస్ న్యూ లుక్ అదిరిందిగా..  క్యాప్, గాగుల్స్ లో డార్లింగ్ నయా ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడే.!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ‘బహుబలి’ తర్వాత ప్రభాస్ రేంజ్ ఊహించని స్థాయికి చేరుకుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అయితే డార్లింగ్ షూటింగ్ బిజీలో ఉండటంతో కాస్తా అభిమానులకు దూరంగా ఉండాల్సి వస్తోంది. కానీ అప్పుడప్పుడు ఫ్యాన్స్ ను ఫిదా చేసేలా నయా లుక్ లో దర్శనమిస్తున్నాడు. 
 

26

ప్రస్తుతం ఇంటర్నెట్ లో ప్రభాస్ కు సంబంధించిన న్యూ పిక్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. గత కొంత కాలంగా ప్రభాస్ కొత్త లుక్స్ తో అభిమానులను ఫిదా చేస్తున్నారు. ఇండియాను షేక్ చేసే కటౌట్ ఉన్నా.. చాలా హ్యాండ్సమ్ గా కనిపించేలా రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా తాజాగా కొన్ని ఫొటోలు ఇంటర్నెట్ లో సందడి చేస్తున్నారు. 
 

36

నిన్న హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ పార్టీకి వెళ్లిన ప్రభాస్ బ్లాక్ షర్ట్, క్యాప్,  గాగుల్స్ పెట్టుకొని నయా లుక్ ను సొంతం చేసుకున్నాడు. ఇన్ షర్ట్ వేసి అదిరిపోయే కటౌట్ లో ఆకట్టుకుంటున్నారు. కొద్ది రోజుల నుంచి ప్రభాస్ ఇదే స్టైల్ లో కనిపిస్తూ అభిమానులకు ఐఫీస్ట్ కలిగిస్తున్నాయి. చాలా అరుదుగా కనిపిస్తున్న ప్రభాస్ తన ఫ్యాన్స్ లో న్యూలుక్ తో జోష్ నింపుతున్నారు.  
 

46

ఇటీవల ‘సీతారామం’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన ప్రభాస్ టీషర్ట్, క్యాప్, గాగూల్స్ లోనే దర్శనమిచ్చాడు. ప్రస్తుతం ఈ ట్రెండ్ యూత్ లోనూ ప్రారంభమైంది. ఎప్పటికప్పుడు తన బాడీని ట్రాన్స్ ఫార్మ్ చేసుకుంటున్న ప్రభాస్.. ఇలా  అట్రాక్టివ్ లుక్ తోనూ మరింత అభిమానులను సంపాదించుకుంటున్నారు. 

56

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్వకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం ‘సలార్’ (Salaar). ఈ చిత్రంలో ప్రభాస్ ప్రధాన పాత్ర  పోషిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా చిత్ర యూనిట్ అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. ప్రభాస్ న్యూ లుక్ ను రిలీజ్ చేస్తూ.. సినిమా రిలీజ్ డేట్ ను కన్ఫమ్ చేసింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేలా మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.

66

భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో తారా స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అందుకుతగ్గట్టుగానే ప్రభాస్ ను తెరపై చూపించేందుకు కష్టపడుతున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ప్రభాస్ కు జోడీగా గ్లామర్ బ్యూటీ Shruti Haasan నటిస్తోంది. ఈ చిత్రానికి కూడా ‘కేజీఎఫ్’ టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ పనిచేస్తుండటం విశేషం.
 

Read more Photos on
click me!

Recommended Stories