ఫ్రెండ్‌ పెళ్లిలో రచ్చ చేస్తున్న ప్రగ్యా జైశ్వాల్‌.. కలర్‌ ఫుల్‌ అందాలతో కనువిందు చేస్తున్న బాలయ్య భామ..

Published : Aug 15, 2022, 02:49 PM IST

బాలయ్య భామ ప్రగ్యా జైశ్వాల్‌ మూడు రోజులుగా పెళ్లిలో ఎంజాయ్‌ చేస్తుంది. ఆమె తన ఫ్రెండ్‌ మ్యారేజ్‌లో సందడి చేస్తుంది. మ్యారేజ్‌లో తనే హైలైట్‌ కావడం విశేషం. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

PREV
16
ఫ్రెండ్‌ పెళ్లిలో రచ్చ చేస్తున్న ప్రగ్యా జైశ్వాల్‌.. కలర్‌ ఫుల్‌ అందాలతో కనువిందు చేస్తున్న బాలయ్య భామ..

`అఖండ` చిత్రంతో బంపర్‌ హిట్‌ అందుకుని పూర్వ వైభవాన్ని పొందింది ప్రగ్యాజైశ్వాల్‌. ఆమెకి విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. బాలయ్య అభిమానులు తన అభిమానులుగా మారిపోయారు. ఆ తర్వాత వెకేషన్‌లోనే గడుపుతున్న ఈ భామ ఇప్పుడు ఫ్రెండ్‌ పెళ్లిలో రచ్చ చేస్తుంది. 
 

26

తన స్నేహితురాలు కార్ల డెన్నిస్‌ కనుంగో వెడ్డింగ్‌ లో పాల్గొంది. గత మూడు నాలుగు రోజులుగా ఆమె మ్యారేజ్‌ ఈవెంట్‌లోనే ఉంది. దగ్గరుండి అన్నిపనులు చూసుకోవడమే కాదు, అందరి కంటే హైలైట్‌గా నిలిచింది. జనరల్‌గా సెలబ్రిటీలు హైలైట్‌ అవుతారనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

36

అందులో భాగంగా ట్రెడిషనల్‌ లుక్‌లో ముస్తాబై కనువిందు చేస్తుంది ప్రగ్యా జైశ్వాల్‌. సందడంతా తనదే అనేట్టుగా ఆమె ముస్తాబు కావడం విశేషం. ఆమె పంచుకున్న ఫోటోల్లోనూ ప్రగ్యా హైలైట్‌ అవుతుంది. ఆమె ఇచ్చిన పోజుల్లోనూ స్పెషల్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 
 

46

ట్రెడిషనల్‌ లుక్‌లో ప్రగ్యా అందాలు రెట్టింపయ్యాయని చెప్పొచ్చు. ఆమె అభిమానులను అద్యంతం కనువిందు చేస్తున్నాయి. దీంతో వాటిని షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. 
 

56

వరుస పరాజయాలతో, సినిమా అవకాశాలు లేని సమయంలో పిలిచి హిట్‌ ఇచ్చాడు బాలయ్య. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన `అఖండ` భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రగ్యాకి మంచి గుర్తింపు వచ్చింది. ఆమె పాత్రకి ప్రశంసలు దక్కాయి. 
 

66

అయితే ఈ సినిమా తర్వాత ఆమెకి వరుసగా ఆఫర్లు వస్తాయని భావించారు. కానీ సీన్‌ రివర్స్ అయ్యింది. ఇప్పటి వరకు మరో ఆఫర్‌ కూడా రాలేదు. దీంతో `అఖండ` హిట్‌ ఆమెకి కలిసి రాలేదనే టాక్‌ ఉంది. దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు వెకేషన్‌లోనే ఎక్కువగా గడుపుతుంది. మరి ఈ బ్యూటీ కెరీర్‌ ఏ వైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories