‘కల్కి’ఓటిటి రిలీజ్ డేట్ వెనక పెద్ద కథే నడిచిందిగా?


ప్రభాస్ హీరోగా   దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కి సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం “కల్కి 2898 ఎడి”. 

Prabhas, Kalki 2898 AD

 ప్ర‌భాస్ (Prabhas) న‌టించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) థియేటర్స్ నుంచి రావాల్సిన కలెక్షన్స్ మాగ్జిమం పిండేసింది. దాంతో ఈ చిత్ర  ప్రభావం భాక్సాఫీస్ దగ్గర  స్లో అవుతూ వస్తోంది.  ఈక్రమంలో ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతోంది. కల్కి సినిమా ఏకంగా రెండు ఓటీటీల్లో డిజిటల్ ప్రీమియర్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు నెట్‌ఫ్లిక్స్‌లో కల్కి 2898 ఏడీ ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ రెండింట్లో ఆగస్ట్ 22  నుంచి కల్కిని డిజిటల్ ప్రీమియర్ చేయనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. అయితే ఈ డేట్ ఫిక్స్ చేయటం వెనక ఓటిటి సంస్దలతో డిస్కషన్స్ నడిచినట్లు సమాచారం. 

kalki in amazon prime

జూన్ 27న విడుదలైన కల్కి ఏడి 2898 మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కొద్ద నేపధ్యంలో  దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ మూవీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకువెళ్లింది. ఫస్ట్ పార్ట్ మొత్తం  మోసింది అశ్వథ్థామ గా వేసిన అమతాబ్ బచ్చన్ అయినా.. ప్రభాస్ ఛరిష్మాతోనే ఓపెనింగ్స్ వచ్చాయి. కమల్ హాసన్, దీపికా పదుకోణ్, శోభన, పశుపతి, దిశా పటానీ వంటి భారీ తారాగణం కూడా ఉండటంతో ఆడియన్స్ కు ఐ ఫీస్ట్ లా అనిపించిందీ మూవీ. 


Kalki


ఇక సినిమా ఆరంభంలోనూ, చివర్లోనూ వచ్చిన కురుక్షేత్రం ఎపిసోడ్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. అయితే టికెట్ రేట్ భారీగా ఉండటంతో మళ్లీ మళ్లీ చూడాలనుకున్న ప్రేక్షకులు కాస్త వెనక్కి తగ్గారు. అయితేనేం ఇప్పుడు ఓటిటిల్లో ఎప్పుడు చూద్దామా అంటూ ఆతృతగా ఉన్నారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 22 నుంచి కల్కి మూవీ స్ట్రీమ్ కాబోతోంది. ప్రైమ్ లో కేవలం సౌత్ లాంగ్వెజెస్ లో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. రెండు మూడు  రోజుల తేడాలో నెట్ ఫ్లిక్స్ లో నార్త్ లాంగ్వెజెస్ లో స్ట్రీమ్ అవుతుంది.  
 

Kalki 2898 AD Indian collection report out

 ఈ చిత్రం ఓటిటి రిలీజ్ ని మొదట ఆగస్ట్ 15 న ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఆ రకంగా  ఓటిటి సంస్దలు ఆగస్ట్ 15 శెలవు ఆ తర్వాత లాంగ్  వీకెండ్ ని క్యాష్ చేసుకోవాలనుకున్నాయి. అయితే అదే సమయంలో థియేటర్ రన్నింగ్ ఉన్న కల్కి  సినిమాని తీసేయటానికి చాలా మంది ఎగ్జిబిటిటర్స్ ఒప్పుకోలేదు. ఖచ్చితంగా లాంగ్ వీకెండ్, ఆగస్ట్ 15 కు ఈ ప్రభాస్ సినిమా చూటడానికి పిల్లలు, పెద్దలు వస్తారు. అదీ రేటు తగ్గింపు ఉంది కాబట్టి ఖచ్చితంగా వర్కవుట్ అవుతుందని నమ్మారు. 

Kalki 2898 AD global collection report out


అయితే ఆగస్ట్ 15 తేదీనే ఓటిటిలో వచ్చేస్తే థియేటర్ రెవిన్యూ ఒక్కసారిగా పడిపోతుంది. ఇది గమనించిన  నిర్మాత వెంటనే రంగంలోకి దిగి ఓటిటి సంస్దలతో మాట్లాడి, తమకు ఇవ్వాల్సిన మొత్తం తగ్గించుకోమని వీకెండ్ పూర్తయ్యాక ఓటిటిలో వదలమని రిక్వెస్ట్ చేసారట. పెద్ద నిర్మాత ..వారి సంస్ద నుంచి వచ్చే పెద్ద సినిమాలుతో అవసరాలు ఉంటాయి కాబట్టి ఓటిటి సంస్దలకు కూడా ఓకే చేసినట్లు సమాచారం. ఆ రకంగా ఆగస్ట్ 22 నుంచి కల్కి ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యిందని అంతర్గత వర్గాల సమాచారం. 

Kalki 2898 AD

 
మరో ప్రక్క  కల్కి టీమ్ ..ఓటిటి వెర్షన్ లో మార్పులు చేయాలనుకుంటోంది. ఆరు నిముషాలు ట్రిమ్ చేసిన వెర్షన్ ని రెడీ చేసారట. ఎక్కడైనా బోర్ కొట్టిన చోట సినిమాని పరుగెట్టించటం , విసుగ్గా అనిపించే సీన్స్ ని లెంగ్త్ తగ్గించటం వంటివి చేసారట. అలా మూడు గంటల సినిమాకు కొంత కోత పెట్టారని చెప్పుకుంటున్నారు. అయితే అందులో ఎంతవరకూ నిజముంది అనేది తెలియాల్సి ఉంది. 

  
ఇక భైరవ పాత్రలో చేసిన పెర్ఫార్మెన్స్, అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్ అదరకొట్టే నటన, అంతకు మించి నాగ్ అశ్విన్ మేకింగ్ విజన్ కి ఆడియన్స్ నీరాజనాలు పడుతున్నారు.  వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మించిన  ఈ చిత్రంలో దీపికా పదుకొనే, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. కల్కి’లో  కమల్ హాసన్‌ విలన్‌గా కనిపించారు. సుప్రీం యాస్కిన్‌ పాత్రను ఆయన (Kamal Haasan) పోషించారు. తాజాగా ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తన పాత్రను అంగీకరించడానికి ఏడాది సమయం తీసుకున్నట్లు తెలిపారు.  ‘ఈ పాత్ర గురించి చెప్పగానే నాకు స్వీయసందేహం వచ్చింది. నేను దీన్ని చేయగలనా అనిపించింది. గతంలో చాలా సినిమాల్లో విలన్‌గా నటించాను. కానీ, ఇది వాటికి మించినది. భిన్నమైన పాత్ర. అందుకే దీనికి సంతకం చేయడానికి ఏడాది ఆలోచించా’ అని చెప్పారు.

Latest Videos

click me!