కల్కి పార్ట్ 2 టైటిల్ మారిపోయిందా, నాగ్ అశ్విన్ మామూలోడు కాదే.. ఇది మాత్రం దిమ్మతిరిగే ట్విస్ట్ ?

First Published | Sep 22, 2024, 4:08 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చివరి చిత్రం కల్కి 2898 ఎడి. నాగ్ అశ్విన్ తన క్రియేటివిటీతో మహాభారతం, కల్కి అవతారం నేపథ్యంలో కల్పిత కథని వెండితెరపై ఆవిష్కరించారు. క్లైమాక్స్ లో ప్రభాస్ ని నాగ్ అశ్విన్ కర్ణుడిగా చూపించడం అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పొచ్చు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చివరి చిత్రం కల్కి 2898 ఎడి. నాగ్ అశ్విన్ తన క్రియేటివిటీతో మహాభారతం, కల్కి అవతారం నేపథ్యంలో కల్పిత కథని వెండితెరపై ఆవిష్కరించారు. క్లైమాక్స్ లో ప్రభాస్ ని నాగ్ అశ్విన్ కర్ణుడిగా చూపించడం అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పొచ్చు. విజువల్స్ కూడా హాలీవుడ్ స్థాయిలో ఉంటూ మెప్పించాయి. సరికొత్త అనుభూతుని ఈ చిత్రం ఇండియన్ ఆడియన్స్ కి అందించింది. 

కల్కి చిత్రానికి పార్ట్ 2 రాబోతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ లో కొన్ని ప్రశ్నలు అలాగే వదిలేశారు. అయితే పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. కానీ దీనిపై బలమైన రూమర్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఒక న్యూస్ ఏంటంటే పార్ట్ 2 టైటిల్ మారిపోతోంది అట. ఆల్రెడీ నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తూ టైటిల్ మార్చేసినట్లు చెబుతున్నారు. 


ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతోంది. రెండవ భాగానికి కల్కి 2 కాకుండా మరో టైటిల్ ఫిక్స్ అయిందని అంటున్నారు. అదేంటంటే 'కర్ణ 3102 BC' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్. కల్కి టైటిలే కల్కి 2898 AD అని ఉంటుంది. కానీ కర్ణ 3102 BC ఏంటి అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడే దిమ్మతిరిగే ట్విస్ట్ ఉండబోతోంది. కథ కంప్లీట్ గా కలియుగం నుంచి గతంలోకి అంటే మహాభారతంలోకి వెళుతుందట. 

Director Nag Ashwins upcoming film udate out

'కర్ణ 3102 BC' లో నాగ్ అశ్విన్ ఎక్కువగా మహాభారత సన్నివేశాలని..కర్ణుడు, అశ్వథామ మధ్య ఏం జరిగింది అనే కథని చూపించబోతున్నారట. అదే విధంగా కమల్ హాసన్ యాస్కిన్ పాత్రకి సంబందించిన ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుందట. కథ కలియుగం నుంచి మహాభారతంలోకి అంటే భవిష్యత్తు నుంచి గతంలోకి వెళుతుంది కాబట్టి టైటిల్ లో బిసి అని వచ్చేలా చేశారు. 

ఈ చిత్రాన్ని 2025 లో ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2028 కల్లా రిలీజ్ చేయాలని నాగ్ అశ్విన్ టార్గెట్ పెట్టుకున్నారట. దీనిపై అధికారిక సమాచారం లేదు కానీ బలమైన రూమర్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. 

Latest Videos

click me!