జగన్‌కి ఝలక్‌ ఇచ్చిన మోహన్‌బాబు, చంద్రబాబుకి మద్దతు ప్రకటిస్తూ మంచు ఫ్యామిలీ అదిరిపోయే ట్విస్ట్!

First Published | Sep 22, 2024, 1:55 PM IST

తిరుమల లడ్డూ వివాదంపై మంచు మోహన్‌బాబు స్పందించారు. జగన్‌కి ఝలక్‌ ఇస్తూ, చంద్రబాబుకి మద్దతు ప్రకటించారు. మంచు హీరోలు సైతం దీనిపై స్పందించడం చర్చనీయాంశంగా మారింది. 
 

విలక్షణ నటుడు, కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు.. నందమూరి తారక రామారావుని ఆరాధిస్తారు. అన్నగారు అంటూ ఆయన్ని తరచు తలుచుకుంటారు. ఆయనకు అనేక సందర్భాల్లో అండగా నిలిచారు. కలిసి సినిమాలు కూడా చేశారు. అంతేకాదు రాజకీయాల్లోనూ సపోర్ట్ గా ఉన్నారు. టీడీపీ నుంచి ఆయన రాజ్యసభ ఎంపీగానూ ఎంపికయ్యారు. ఏపీలో వైఎస్‌ జగన్‌ సీఎం కావడానికి ముందు వరకు టీడీపీకి సపోర్ట్ గా ఉన్న మోహన్‌బాబు జగన్‌ సీఎం అయ్యాక పార్టీ మారారు. వైసీపీలో చేరారు. ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్‌గా లేకపోయినప్పటికీ వైసీపీలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.

ఇదిలా ఉంటే తాజాగా ఆయన పెట్టిన పోస్ట్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు చంద్రబాబుకి మోహన్‌ బాబు మద్దతు ప్రకటించడం విశేషం. అయితే ఆయన మద్దతు ప్రకటించింది టీటీడీ లడ్డు వివాదం విషయంలో. దేశంలోనే అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ అపవిత్రంగా మారిందని ఆరోపిస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం.

లడ్డూలో బీఫ్‌ ఆయిల్‌ వాడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. పలు ల్యాబ్స్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. దీంతో ఇది పెద్ద వివాదంగా మారింది. ఏపీ రాజకీయాలను వేడెక్కించింది. ఏపీలో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ఇది చర్చనీయాంశం అవుతుంది. శ్రీవారి భక్తులు ఇండియా వైడ్‌గా ఉంటారు. ప్రాంతాలకు అతీతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. లడ్డూ ప్రసాదం స్వీకరిస్తుంటారు. 
 

Latest Videos


కానీ ఇప్పుడు అందులో బీఫ్‌ ఆయిల్‌ వాడుతున్నారనే వార్త అందరిని కలిచివేస్తుంది. దీనిపై రాజకీయ వేడి రాజుకుంటుంది. మరోవైపు తమపై చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తుందని వైసీపీ నాయకులు, జగన్‌ ఆరోపిస్తున్నారు. ఈ విషయం హీటెక్కిస్తున్న నేపథ్యంలో దీనిపై మోహన్‌బాబు స్పందించారు. ఆయన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, తీవ్రంగా ఖండించారు. లడ్డూలో బీఫ్‌ ఆయిల్‌ కలపడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు మోహన్‌బాబు. 
 

Chandra Babu

`ప్రపంచ వ్యాప్తంగా ప్రతి హిందూ పూజింగే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆ దైవానికి నిత్యం సమర్పించే లడ్డూలలో కలిపే ఆవు నెయ్యిల దాదాపు 3 నెలల క్రితం వరకు జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయాను. తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను, నిత్యం మా మోహన్‌బాబు విశ్వ విద్యాలయం నుంచి కన్పించే తిరుమల క్షేత్రాన్ని చూసి నాతోపాటు వేలాది మంది ఉపాధ్యాయులు,విద్యార్థులు నిత్యం భక్తిపూర్వకంగా నమస్కరించుకుంటాం.

ఆ స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరాతిఘోరం, పాపం, నికృష్టం, అతినీచం, హేయం, అరాచకం, ఇదేగానీ నిజమైతే నేరస్థులను శిక్షించాలని నా ఆత్మీయుడు, నా మిత్రుడు ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడిని హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఈ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు నా మిత్రుడు అందుకుని నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నా` అని తెలిపారు మోహన్‌బాబు. 

మరోవైపు దీనిపై మంచు విష్ణు కూడా స్పందించారు. ప్రకాష్‌ రాజ్‌కి కౌంటర్‌గా వేస్తూ ఆయన శ్రీవారి లడ్డూ పవిత్రత గురించి చెప్పారు. ఇప్పుడు మంచు మనోజ్‌ కూడా ఈ విషయాన్ని ఖండించారు. లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని వమ్ము చేస్తూ మన పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వుని వాడారని తెలియడం తీవ్ర కలకలం రేపుతుంది. ఇది విశ్వాస ఉల్లంఘన, రాజకీయాలకు అతీతంగా హిందూ మనోభావాలకు అవమానం. అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని, బాధ్యులను గుర్తించి, జవాబుదారీ తనం ఉండేలా చూడాలని కోరుకుంటున్నా` అని తెలిపారు. 

అనూహ్యంగా జగన్‌కి ఝలక్‌ ఇస్తూ మంచు ఫ్యామిలీ హీరోలు ఇలా చంద్రబాబుకి మద్దతు ప్రకటించడం ఆశ్చర్యంగా మారింది. లడ్డూ విషయంలో మద్దతుగా పలకడం వరకు ఓకే, కానీ ఇందులో రాజకీయ కోణం కూడా ఉందని తెలుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో  మంచు మోహన్‌బాబు వైసీపీకి గుడ్‌ బై చెప్పి, టీడీపీలోకి రాబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇటీవల మోహన్‌బాబు విద్యా సంస్థల్లో పెద్ద గొడవ జరిగింది. స్టూడెంట్స్ పేరెంట్స్ ధర్నాకి దిగారని, అధిక ఫీజులు, భోజనం క్యాంటీన్‌లోనే చేయాలనే నిబంధనలు పెట్టారనే ఆరోపణలు వచ్చాయి. దీన్ని వాళ్లు ఖండించారు. ఆ వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మంచు ఫ్యామిలీ జగన్‌కి షాకిస్తూ చంద్రబాబుకి మద్దుతిస్తూ పోస్ట్ లు పెట్టడం సరికొత్త చర్చకు దారితీస్తుంది.

లడ్డూ వివాదాన్ని ఉపయోగించుకుని సీబీఎన్‌కి దగ్గర కాబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇక మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా `కన్నప్ప` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో మంచు విష్ణ కన్నప్పగా చేస్తున్నారు. ఆయనతోపాటు ప్రభాస్‌, అక్షయ్‌ కుమార్‌, మోహన్‌లాల్‌, శరత్‌ కుమార్‌, కాజల్‌ వంటి భారీ తారాగణం ఇందులో నటిస్తుండటం విశేషం. 

click me!