'కల్కి' IPL యాడ్ కు ఎంత ఖర్చుపెట్టారు, ఎంత మంది చూసారు?

First Published May 21, 2024, 9:43 AM IST

 ఐపీఎల్ మ్యాచ్ మధ్యలోనే భైరవ యాడ్స్ ఇస్తున్నారు. మే 3న ముంబై ఇండియన్స్, కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుందని మ్యాచ్ మధ్యలో కల్కి నుంచి భైరవగా వచ్చి చెప్పాడు ప్రభాస్.

Kalki 2898 AD Kamal Haasan

సినిమాలకు ప్రమోషన్స్ ఎంత ఇపార్టెంటో దర్శక,నిర్మాతలకు బాగా తెలుసు. ముఖ్యంగా భారీ చిత్ర నిర్మాతలకు ఈ విషయం ఇంకాస్త ఎక్కువ తెలుసు. విడుదలైన వారంలో మొత్తం పెట్టుబడి వెనక్కి లాగే స్ట్రాటిజీలుతో ముందుకు వెళ్తున్నారు. ఆ ప్రమోషన్స్ కోసం ఎంత ఖర్చు పెట్టడానికి అయినా సై అంటున్నారు. తగ్గేదేలే అని ముందుకు వెళ్తున్నారు. ఇదే క్రమంలో ప్రభాస్ తాజా చిత్రం కల్కి ఐపీఎల్ యాడ్ కు కూడా భారీగా ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.
 

actor prabhas movie Kalki 2898 AD Building A Superstar bujji


 డైరెక్టర్ నాగ్ అశ్విన్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న   కల్కి 2898 ఏడీ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయో తెలిసిందే. అమితాబ్ బచ్చన్, కమల్ హసన్, దీపిక పదుకొణె, దిశా పటానీ వంటి స్టార్స్ అందరూ నటిస్తున్న ఈ సినిమాను ప్రపంచ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు నాగ్. 6000 ఏళ్ల నాటి కథ కోసం ఏకంగా కొత్త ప్రపంచాన్నే సృష్టించినట్లు గతంలో నాగ్ చేసిన కామెంట్స్ ఈ సినిమాపై మరింత హైప్ పెంచాయి. 

Latest Videos


 కల్కి ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇందుకోసం ఐపీఎల్ మ్యాచ్ సెలక్ట్ చేసుకున్నారు. కల్కి ప్రమోషన్ల కోసం కొత్తగా ఐపీఎల్ మ్యాచ్ మధ్యలోనే భైరవ యాడ్స్ ఇస్తున్నారు. మే 3న ముంబై ఇండియన్స్, కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుందని మ్యాచ్ మధ్యలో కల్కి నుంచి భైరవగా వచ్చి చెప్పాడు ప్రభాస్. “ఇది కూడా ఓ యుద్ధం లాంటిదే” అంటూ ప్రభాస్ చెప్పాడు. ఇందులో ప్రభాస్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. 

ముంబై లక్నో మ్యాచ్ జరుగుతుండగా.. మధ్యలో ఇలా భైరవగా ప్రభాస్ సడెన్ ఎంట్రీ చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ యాడ్ వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.  హెయిర్ స్టైల్, గడ్డం చూసి డార్లింగ్ న్యూలుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఐపీఎల్ మధ్యలో ప్రభాస్ యాడ్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ యాడ్ నిమిత్తం ఎంత ఖర్చుపెట్టారనే ఆసక్తి అభిమానుల్లో మాత్రమే కాకుండా సినీ వర్గాల్లోనూ మొదలైంది. 
 

Kalki


అందుతున్న సమాచారం మేరకు 12 సెకన్లు పాటు కనపడే ఈ యాడ్ కోసం 3 కోట్ల రూపాయలు పే చేసినట్లు సమాచారం. తెలుగు పరిశ్రమకు సంభందించి ఇది చాలా కాస్ట్లీ ప్రమోషన్ అంటున్నారు. ఈ యాడ్ ఖర్చుకు తగినట్లే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చినట్లు చెప్తున్నారు. 


ఈ సినిమా కేవలం తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లోనూ భారీగా రిలీజ్ కానుంది . కాబట్టి ఈ స్దాయి ప్రమోషన్స్ ఖచ్చితంగా అవసరమే అంటున్నారు. ఐపీఎల్ మ్యాచ్ ని ఆరు నుంచి పది కోట్ల మంది చూస్తారు. ఆ టీమ్ క్లాష్ ను బట్టి వ్యూయర్ షిప్ మైలేజ్ పెరగుతుంది. కాబట్టి ప్లాన్ చేసే ప్రమోషన్ చేసారు నాగ్ అశ్విన్. 
  

Kalki 2898

నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్న భారీ సైన్స్ ఫిక్ష‌న్ చిత్రం క‌ల్కి 2898 ఎడి కోసం ప్ర‌భాస్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. రిలీజ్ కి ముందే భారీ బిజినెస్ చేసిన ఈ చిత్రం విజువ‌ల్ గా కొత్త లోకంలోకి తీసుకెళుతుంద‌న్న ప్ర‌చారం న‌డుమ ఎంతో క్యూరియాసిటీ నెల‌కొంది. ఇది భారీ మ‌ల్టీస్టార‌ర్. ప్ర‌భాస్, దీపిక‌, అమితాబ్, క‌మ‌ల్ హాస‌న్ వంటి దిగ్గ‌జాలు న‌టిస్తుండ‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. వీరంతా ఒక‌రితో ఒక‌రు పోటీప‌డి న‌టించేవారే. దీనివ‌ల్ల క‌చ్ఛితంగా స్పెష‌ల్ ట్రీట్ గా నిలుస్తుంద‌ని భావిస్తున్నారు. 


ఈ సినిమా కోసం భారీ సెట్లు, అద్భుత‌మైన కాస్ట్యూమ్స్, భారీత‌నం నిండిన సెట్ల‌లో పాట‌ల్ని తెర‌కెక్కించ‌డంతో విజువ‌ల్ ఫీస్ట్ గా ఉంటుంద‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. కల్కి 2898 AD జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించి, పాన్ ఇండియాలో విడుద‌ల చేస్తోంది.  
  

నాగ్ అశ్విన్ రీసెంట్ ఓ మీడియా ఇంటరాక్షన్ చెప్పినదాని ప్రకారం ఈ చిత్రం మహాభారత కాలంలో మొదలై 2898 లో ముగుస్తుంది. అందుకే ఈ చిత్రానికి ‘Kalki 2898 AD’అని పెట్టామని చెప్పారు.  అలాగే  మేము ఇక్కడ  మన వరల్డ్ ని క్రియేట్ చేయటానికి  ప్రయత్నిస్తున్నాము. పూర్తి భారతీయతను ఈ సినిమాలో అందిస్తాము. 
 


ముఖ్యంగా  ఈ సినిమాని బ్లేడ్ రన్నర్ (హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం) లాగా చేయకూడదనేది మా ముందు ఉన్న ఛాలెంజ్. క్రీ.శ. 2898 నుండి మనం 6000 సంవత్సరాల వెనక్కి వెళితే, మనం క్రీ.పూ. 3102కి చేరుకుంటాం, అంటే కృష్ణుడి చివరి అవతారం గడిచిపోయినట్లే అని క్లారిటీ ఇచ్చారు నాగ్ అశ్విన్.  ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.  కల్కి తో పాటు రాజాసాబ్, సలార్ పార్ట్ 2, స్పిరిట్ చిత్రాలు .. ప్రభాస్ కు క్యూలో ఉన్నాయి.  

click me!