ఈటీవీ నుంచి మ‌రో ott ??..మామూలుగా ఉండదట!! డిటేల్స్

First Published May 21, 2024, 7:33 AM IST

ఇప్పుడు మ‌రో కొత్త ఓటిటి యాప్ లాంచ్ చేయ‌డానికి `ఈనాడు` సిద్ధ‌మైంది. 

 సినిమాలకు థియేటర్ కు వెళ్లే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ తర్వాత సినిమా హాళ్లకు ఆధరణ తగ్గి..ఓటీటీకీ  క్రేజ్ వచ్చింది. దాంతో       ఓటిటిలు బిజినెస్ పెంచుకుంటూ పోతున్నాయి. అయితే  ఓటీటీ ప్లాట్​ఫామ్స్ అన‌గానే గుర్తొచ్చేవి అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), నెట్ ఫ్లిక్స్ (Netflix), డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్. ప్ర‌స్తుతం వీటి హ‌వా న‌డుస్తోంది. పైన చెప్పిన స్ట్రీమింగ్ యాప్స్ అన్నీ వేరే దేశాలకు, ప్రాంతాలకు చెందిన‌వి. కానీ మ‌న తెలుగులో కూడా మేజర్ గా రెండు ఓటీటీ ప్లాట్​ఫామ్ ఉన్నాయి అవే  ‘ఆహా’,‘ఈటీవీ విన్‌’.
 

eTV

ఆహా – అనేది అర్హా మీడియా & బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యానికి చెందిన ఓటీటీ ప్లాట్ ఫ్లామ్. ఇది గీతా ఆర్ట్స్, మై హోమ్ గ్రూప్ జాయింట్ వెంచర్. ఇది మొద‌టి తెలుగు డిజిట‌ల్ స్ట్రీమింగ్ యాప్. 2020 మార్చి 25న దీన్ని ప్రారంభించారు. దీనిలో తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు ఎక్స్‌క్లూజివ్స్, ఆహా వరల్డ్ డిజిటల్ ప్రీమియర్స్, ఆహా ఒరిజినల్స్ త‌దిత‌ర కంటెంట్ ఉంటుంది. ఈ యాప్ అన్ని మొబైల్, టాబ్లెట్, వెబ్, స్మార్ట్ టీవీ, స్ట్రీమింగ్ డివైజ్​ల్లో ప‌నిచేస్తుంది. అన్​స్టాప‌బుల్, సామ్ జామ్ లాంటి ప్రోగ్సామ్స్​తో బాగా ఫేమ‌స్ అయిందీ యాప్. అయితే ఈ మధ్యకాలంలో ఈ యాప్ తన ప్రాభవం కోల్పోతోంది. ఈ మధ్యన ఈ యాప్ ని అమ్మేస్తారనే ప్రచారాలు గట్టిగా జరిగాయి. 

Latest Videos


మరో ప్రక్క ఈటీవి నుంచి వచ్చిన ఓటీటి ఈటీవి విన్. చరిత్రలో నిలిచిపోయే అపురూపమైన చిత్రాలు, ఉత్కంఠను రేపే ఒరిజినల్‌ సినిమాలు,ఆద్యంతం ఉత్సాహంగా కలిగించే రియాల్టీ షోలు, డైలీ సీరియళ్లు.. ఇవన్నీ ఒకే వేదికపై అందిస్తానంటూ వచ్చింది  ఈటీవీ విన్.  ఈటీవీకి చెందిన అన్ని ఛానళ్లు, ప్రత్యేకంగా రూపొందించిన చిత్రాలు, షోలు.. రోజుకు కేవలం ఒక్క రూపాయికే చూసే అవకాసం ఇచ్చారు. అయితే అనుకున్న స్దాయిలో ఈటీవి విన్ సక్సెస్ కాలేదనే చెప్పాలి. ఈటీవి విన్ చిన్న సినిమాలకు మాత్రమే కేరాఫ్ ఎడ్రస్ గా మిగిలింది. దానికి ఎంత ప్రమోట్ చేసినా సబ్ స్కైబర్స్ బేస్ పెద్దగా పెరగలేదు.   

rajamouli ramoji rao


ఈ క్రమంలో  ఇప్పుడు మ‌రో కొత్త ఓటిటి యాప్ లాంచ్ చేయ‌డానికి `ఈనాడు` సిద్ధ‌మైంది. ఈసారి ‘ఆర్‌.ఎమ్‌.ఎమ్’ పేరుతో ఈ ఓటీటీ రాబోతోందని సమాచారం.  రామోజీ మూవీ మ్యాజిక్ దీని పేరు అని తెలుస్తోంది. ‘ఈటీవీ విన్‌’కేవలం తెలుగు సినిమాల‌కు ప‌రిమిత‌మైంది కాబట్టి ‘ఆర్‌.ఎమ్.ఎమ్‌’ మాత్రం నెట్‌ఫ్లిక్స్,అమేజాన్ ప్రైమ్ స్దాయిలో  అన్ని భాష‌ల సినిమాల‌కూ వేదిక కానుందని సమాచారం. 

‘ఆర్‌.ఎమ్.ఎమ్‌’యాప్ కోసం దాదాపు రూ.500 కోట్ల బ‌డ్జెట్ కేటాయించిన‌ట్టు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని హాలీవుడ్ నిర్మాణ సంస్దలతో బాలీవుడ్ నిర్మాతలతో టైఅప్ అవుతోందని వినికిడి. ఈటీవికి ఉన్న నెట్ వర్క్ తో మన దేశ ఇతర భాషా సినిమాలకు, వాటి డబ్బింగ్ కు సమస్య ఉండదు. ఈ మేరకు  గత కొంతకాలంగా ఈ యాప్ కోసం బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. రీసెంట్ గా రామోజీరావుకు ఈ వివరాలతో ఫైల్ ఇచ్చారని సమాచారం.
 

ఇక ఈ కొత్త యాప్ ని ఈ ద‌స‌రాకు అధికారికంగా లాంచ్ చేసే అవ‌కాశం ఉందని చెప్తున్నారు. ‘ఆర్‌.ఎమ్‌.ఎమ్‌’ కోసం ఇప్ప‌టికే కొన్ని సినిమాలు రెడీ చేశార‌ని, వాటి వివ‌రాల్ని కూడా త్వ‌ర‌లో బయిటకు వస్తాయని స‌మాచారం.   డిజిటల్ ప్రపంచంలో ఈ టీవి వారి ఈ కొత్త ఓటీటీ... సరికొత్త వినోదాన్ని అందించనుంది. ప్రపంచ భాషల్లో  విడుదలైన సరికొత్త చిత్రాలను... 'వరల్డ్ డిజిటల్ ప్రీమియర్'గా అందిస్తుందని అంటున్నారు. అయితే అఫీషియల్ సమాచారం అయితే ఏమీ లేదు.
 


 సినిమా థియేటర్లలోకానీ, టీవీల్లో కానీ విడుదలకాని.... ఈ సరికొత్త సినిమాలు,షోలు కేవలం ‘ఆర్‌.ఎమ్‌.ఎమ్‌’ప్రేక్షకులకే మాత్రమే ప్రత్యేకం అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. దేశీయ మార్కెట్ ని పెంచుకోవాలని ఈ యాప్ లక్ష్యంగా చెప్తున్నారు. అలాగే  త‌మ కంటెంట్ తోనే చందాదారుల్ని పెంచుకోవాల‌ని చూస్తున్నారట. ఏదైమైనా సరిగ్గా ప్లాన్ చేస్తే  ప్ర‌స్తుతం ఓటీటీ రంగంలో అజ‌మాయిషీ చేస్తున్న మిగిలిన ఛాన‌ళ్ల‌కు ప్ర‌త్యామ్నాయంగా ‘ఆర్.ఎమ్‌.ఎమ్‌’మారుతుందని అంటున్నారు. 
 

ఈ ఓటిటి కోసం రాజమౌళి వంటి స్టార్ డైరక్టర్స్ తో ప్రత్యేకమైన షోలు , వెబ్ సీరిస్ లు ప్లానింగ్ కోసం చేయాలని చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే కేవలం చిన్న సినిమాలు మాత్రమే కాకుండా పెద్ద సినిమాలు కూడా ఈ ఓటిటిలోకి తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకుంటన్నారు. ఏది ఎంతవరకూ నిజం అనేది పూర్తి విషయాలు బయిటకు వస్తే కానీ తెలిసే అవకాసం లేదు.

click me!