పెళ్లి తర్వాత వాటిలో మార్పు, అందం కోసం సర్జరీ చేయించుకున్న కాజల్... అవి గమనించారా?

First Published | May 21, 2024, 7:12 AM IST

కాజల్ అగర్వాల్ గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. అందం కోసం ఆమె సర్జరీకి పాల్పడ్డారట. పెళ్లి తర్వాత వచ్చిన ఓ మార్కు ఆమె గ్లామర్ ని దెబ్బ తీసిన నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారట. 
 

కాజల్ అగర్వాల్ పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు అవుతుంది. 2004లో విడుదలైన క్యూ హో గయా నా... ఆమె డెబ్యూ మూవీ. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ సపోర్టింగ్ రోల్ చేసింది. అమితాబ్, ఐశ్వర్య రాయ్, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలు చేశారు. 

Kajal Aggarwal

మూడేళ్ళ గ్యాప్ అనంతరం లక్ష్మీ కళ్యాణం మూవీలో హీరోయిన్ ఆఫర్ పట్టేసింది. కొత్తవాళ్ల చేయడానికి ఇష్టపడే దర్శకుడు తేజ కాజల్ కి ఆఫర్ ఇచ్చాడు. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లక్ష్మీ కళ్యాణం ఆశించిన స్థాయిలో ఆడలేదు. మూడో చిత్రం చందమామతో ఆమెకు ఫస్ట్ హిట్ తగిలింది. మగధీర చిత్రం కాజల్ ఫేట్ మార్చేసింది. 


టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగిన కాజల్ సౌత్ ఇండియాను ఏలారు. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ స్టార్స్ తో జతకట్టింది. ముఖ్యంగా టాలీవుడ్ లో ఆమె నటించని స్టార్ హీరో లేడు. నాగార్జున, వెంకటేష్ లను మినహాయిస్తే రెండు తరాల స్టార్స్ పక్కన ఆమె హీరోయిన్ గా చేసింది. కాజల్ కెరీర్లో అనేక బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. 

2020లో సడన్ గా కాజల్ పెళ్లి పీటలు ఎక్కింది. తన ఫ్యామిలీ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది. వెంటనే ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేశారు. వీరికి నీల్  కిచ్లు అనే అబ్బాయి కూడా ఉన్నాడు. ప్రస్తుతం కాజల్ అటు ఫ్యామిలీని ఇటు ప్రొఫెషన్ ని బ్యాలన్స్ చేస్తుంది. 

పెళ్లి తర్వాత కూడా కాజల్ ఫేమ్ తగ్గలేదు. ఆమెకు అడపాదడపా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే కాజల్ సర్జరీ చేయించుకున్నారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. వివాహం అనంతరం ఆమె పెదవులు నల్లగా తయారయ్యాయట. లాభం లేదని కాజల్ తన పెదవులకు సర్జరీ చేయించిందట. 

Kajal Aggarwal

పింక్ కలర్ లో మరింత రొమాంటిక్ గా ఉండేలా వాటిని మార్చుకుందట. సత్యభామ చిత్ర ప్రమోషన్స్ పాల్గొంటున్న కాజల్ ని చూసిన జనాలు ఈ సందేహం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే కాజల్ పెదవులు గతానికి భిన్నంగా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆమె నిజంగా సర్జరీ చేయించుకున్నారా? లేదా అనే విషయం పై స్పష్టత లేదు.

సత్యభామ మూవీలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ అధికారిణి రోల్ చేసింది. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ కాగా నవీన్ చంద్ర కీలక రోల్ చేస్తున్నాడు. సత్యభామ మూవీ మే 31న విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్స్ లో విరివిగా పాల్గొంటుంది కాజల్. 
 

Latest Videos

click me!