భైరవని అశ్వథామ ఓడించకపోతే 'కల్కి' అవతారం సాధ్యం కాదా ?.. రిలీజ్ ట్రైలర్ లో హైలైట్స్ ఇవే 

First Published Jun 21, 2024, 10:41 PM IST

కల్కి అవతారం కోసం ఎదురు చూస్తున్న అశ్వథామకి.. సుమతి కడుపున ఆయన పుట్టబోతున్నాడని తెలుస్తోంది. కల్కి క్షేమంగా పుట్టేలా సుమతిని రక్షించే భాద్యత అశ్వథామ పాత్రలో ఉన్న అమితాబ్ తీసుకుంటారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి  మరో వారం రోజుల్లోనే థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే కల్కి ఒక ప్రత్యేక చిత్రం అని చెప్పొచ్చు. సరిగ్గా హాలీవుడ్ స్టాండర్డ్స్ ని మ్యాచ్ చేస్తూ భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఆయన కుమార్తెలు ఈ చిత్రాన్ని నిర్మించారు.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత పురాణాలకి సంబంధించిన అంశాలకి సైన్స్ ఫిక్షన్ జోడిస్తూ ఈ కథ సిద్ధం చేశారు. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ అంచనాలు పెంచేసింది. ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ పేరుతో సెకండ్ ట్రైలర్ ని విడుదల చేశారు. 

Latest Videos


రిలీజ్ ట్రైలర్ తో కథ గురించి ఇంకాస్త క్లారిటీ వచ్చింది. దీపికా పదుకొనె సుమతి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె కడుపునే కల్కి భగవానుడు జన్మించబోతున్నాడు. అయితే కల్కి జన్మని అడ్డుకోవడానికి కాంపెక్స్ లో ఉన్న దుష్ట శక్తులు ప్రయత్నిస్తుంటాయి. 

బాగా డబ్బు సంపాదించి కాంప్లెక్స్ లో ఎంజాయ్ చేయాలని భైరవగా నటిస్తున్న ప్రభాస్ భావిస్తాడు. అతడి కోరిక ప్రకారం డబ్బు సంపాదించే అవకాశం దక్కుతుంది. సుమతిని బంధించి ఇస్తే బాగా డబ్బు ఇస్తామని చెబుతారు. అంటే ఆమెని పట్టుకునే టాస్క్ ప్రభాస్ ది. 

కానీ కల్కి అవతారం కోసం ఎదురు చూస్తున్న అశ్వథామకి.. సుమతి కడుపున ఆయన పుట్టబోతున్నాడని తెలుస్తోంది. కల్కి క్షేమంగా పుట్టేలా సుమతిని రక్షించే భాద్యత అశ్వథామ పాత్రలో ఉన్న అమితాబ్ తీసుకుంటారు. ఈ క్రమంలో భూమి బద్దలయ్యే యుద్ధం ప్రభాస్, అమితాబ్ మధ్య జరుగుతుంది. 

భైరవ ఏమో తాను ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు.. ఇది కూడా ఓడిపోను అంటున్నాడు. తన మాట ప్రకారం అశ్వథామ పై గెలిచి.. సుమతిని విలన్లకి అప్పగిస్తే కల్కి జననం సాధ్యం అవుతుందా ? అనేలా నాగ్ అశ్విన్ ఉత్కంఠ రేకెత్తించే అనుమానం క్రియేట్ చేశాడు. 

మరోవైపు మహాభారతంలో తాను చేసిన తప్పుని గుర్తు చేసుకుంటుంటాడు అశ్వథామ.. అప్పుడు ఆయన గర్భవతిపై అస్త్రం సంధించి పాపం చేశాడు. ఇప్పుడు సుమతిని రక్షిస్తే ఆయన చేసిన పాపానికి పరిష్కారం దొరుకుతుంది. అంటే అశ్వథామ కూడా పట్టు వదలదు. మరి అశ్వథామ, భైరవలలో ఎవరు గెలుస్తారు ? అనే ప్రశ్న తలెత్తుతోంది. భైరవ హీరో కాబట్టి మంచి కోసం ఏ సందర్భంలో పోరాటం మొదలు పెడతాడు అనేది కూడా ఆసక్తికరం. 

మరోవైపు కలి పురుషుడు అన్నట్లుగా భయంకర రూపంతో కమల్ హాసన్ పాత్రని చూపించారు. మొదటి ట్రయిలర్ కి ఈ ట్రైలర్ కి ఆయన రూపంలో కాస్త వ్యత్యాసం ఉంది. ఇక యాక్షన్ సన్నివేశాల్లో ఉపయోగించే భారీ ఆయుధాలు, ఆ విజువల్స్ విజువల్ ఫీస్ట్ అన్నట్లుగా ఉన్నాయి. ఓవరాల్ గా హిందూ పురాణాల అంశాలు, కల్కి అవతారం, భారీ యాక్షన్ సీన్లు అన్ని కలగలిపిన హాలీవుడ్ స్థాయి చిత్రాన్ని చూడబోతున్నాం అని మాత్రం చెప్పొచ్చు. 

click me!