నా బొచ్చు కూడా పీకలేరంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు వార్నింగ్

First Published May 22, 2024, 4:47 PM IST

జూ ఎన్టీఆర్ అభిమానులకి నేను చెప్పేది ఒక్కటే. మీరు వైసీపీకి సపోర్ట్ చేశామని అంటున్నారు.. 

Nandamuri Chaitanya Krishna


గత కొంతకాలంగా ఎన్టీఆర్ ఫ్యామిలీకి జూ ఎన్టీఆర్‌కి మధ్య దూరం పెరిగిందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. చాలా సందర్భాల్లో ఈ విషయం తెర మీదకి వచ్చింది. జూ ఎన్టీఆర్ బ్యానర్లు, ఫ్లెక్సీలను అర్జెంట్‌గా ఇక్కడి నుంచి పీకి పారేయండి అంటూ ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర బాలకృష్ణ అప్పట్లో చెప్పిన వీడియో కూడా తెగ వైరల్ అయింది. 

ఇక ఇప్పుడు ఏకంగా నందమూరి చైతన్య కృష్ణ బహిరంగంగా  జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను హెచ్చరించారు. ఇది మరో వివాదానికి తెర లేపినట్లు అయ్యింది. ఈ విషయమై తారక్ ఫ్యాన్స్ దీనిపై ఇంకెంత ఘాటుగా రియాక్ట్ అవుతారో చూడాలి. సాధారణంగా ఇలాంటి విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో చాలా వేగంగా స్పందింస్తూ ఉంటారు. ఇంతకీ నందమూరి చైతన్య కష్ణ ఏమన్నారంటే..


"జూ ఎన్టీఆర్ అభిమానులకి ఇదే నా వార్నింగ్. వైసీపీకి అందులోనూ ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీకి మద్దతు ఇచ్చిన జూ ఎన్టీఆర్ అభిమానులకి నేను చెప్పేది ఒక్కటే. మీరు వైసీపీకి సపోర్ట్ చేశామని అంటున్నారు.. అయినా మీరు ఎవరూ మా బొచ్చు కూడా పీకలేరు. నేను ఉండగా చంద్రబాబు నాయుడు మావయ్య, నందమూరి బాలకృష్ణ బాబాయ్‌లను టచ్ కూడా చేయలేరు. నా సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా మీరు (జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్), వైసీపీ కలిసి నన్ను బాగా ట్రోల్ చేశారు. జాగ్రత్తగా ఉండండి" అంటూ చైతన్య కృష్ణ హెచ్చరించారు.
 


ఫేస్ బుక్ లో పెట్టిన ఈ పోస్ట్‌పై జూ ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్టును షేర్ చేస్తూ చైతన్య కృష్ణను ఏకిపారేస్తున్నారు. కొందరు ఆశ్చర్యపోతూ జూ ఎన్టీఆర్‌ను ఇందులోకి లాగాల్సిన అవసరమేంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు పూర్తయ్యాక ఈ పోస్టు పెట్టడమేంటని, ఎన్నికలకి ముందు పెట్టుంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ పవర్ తెలిసేదంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి సడెన్‌గా చైతన్య కృష్ణ ఇలా పోస్ట్ ఎందుకు చేశారనేది హాట్ టాపిక్ గా మారింది.
 

 నందమూరి జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ చాలా కాలం క్రితమే నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో సినిమాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. గత ఏడాది బ్రీత్ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. 

nandamuri chaitanya krishna


బ్రీత్  సినిమా రిలీజ్ అయిన తర్వాత చైతన్య కృష్ణపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. వీటిపై పలు ఇంటర్వ్యూల్లో చైతన్య కృష్ణ కూడా రియాక్ట్ అయ్యారు.  అయితే తెలుగుదేశం గెలవాలని సోషల్ మీడియా వేదికగా గతంలో పోస్టులు పెడుతూ వచ్చిన ఆయన తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను టార్గెట్ చేస్తూ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ గురించి చర్చ జరుగుతోంది.

Latest Videos

click me!