పరిస్థితులన్నీ అనుకూలం.. RRR రికార్డులతో పాటు 1000 కోట్ల మార్క్ పై ప్రభాస్ 'కల్కి' కన్ను, సాధ్యమేనా ?

Published : Jun 06, 2024, 09:48 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మాణంలో దాదాపు 600 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఈ చిత్రానికి సంబందించిన ప్రతి అంశం అంచనాలని పెంచేస్తోంది.

PREV
17
పరిస్థితులన్నీ అనుకూలం.. RRR రికార్డులతో పాటు 1000 కోట్ల మార్క్ పై ప్రభాస్ 'కల్కి' కన్ను, సాధ్యమేనా ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మాణంలో దాదాపు 600 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఈ చిత్రానికి సంబందించిన ప్రతి అంశం అంచనాలని పెంచేస్తోంది. దీపికా పదుకొనె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి హేమా హేమీలు ఈ చిత్రంలో నటిస్తున్నారు. 

 

27

మహాభారత సమయంలో మొదలైన కథ కలియుగంలో కల్కి వచ్చే వరకు సాగుతుంది. అసలు యుగాలని కనెక్ట్ చేస్తూ నాగ్ అశ్విన్ ఎలాంటి కథ రూపొందించారు అని అందరిలో ఉత్కంఠ పెరిగిపోతోంది. దీనికి తోడు బుజ్జి అంటూ సై ఫై కారుని పరిచయం చేశారు. టీజర్ లో కళ్ళు చెదిరే ఆధునిక యుద్దాలు జరుగుతున్నాయి. 

 

37

అమితాబ్ బచ్చన్ అశ్వథామ పాత్రలో నటిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడెప్పుడు కల్కి రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ వైట్ చేస్తున్నారు. జూన్ 27న కల్కి గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే కల్కి ముందు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ ఇంత భారీ చిత్రంతో వస్తుంటే రికార్డులు తిరగరాయాలని తప్పకుండా ఫ్యాన్స్ కోరుకుంటారు. 

 

47
Kalki 2829 AD

ఈ క్రమంలో ముందుగా గుర్తుకు వచ్చేది ఆర్ఆర్ఆర్ చిత్రమే. ఆర్ఆర్ఆర్ చిత్ర ఓపెనింగ్కలెక్షన్స్ రికార్డ్ ని కల్కి బ్రేక్ చేస్తుందా లేదా అనే చర్చ జరుగుతోంది. కల్కి భారీ ఓపెనింగ్స్ కి కావాల్సిన స్టేజ్ అయితే సెట్ అయిపోయినట్లే అని విశ్లేషకులు అంటున్నారు. 

 

57
Kalki 2829 AD

ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. త్వరలో చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నారు. అశ్విని దత్ కి, చంద్రబాబు కి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనితో ఎక్స్ట్రా షోలో, టికెట్ ధరలు, బెనిఫిట్ షోలకు ఎలాంటి డోకా ఉండదని అంటున్నారు. కాబట్టి రికార్డ్ ఓపెనింగ్స్ కి కావలసిన పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. 

 

67

ఆర్ఆర్ఆర్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 75 కోట్ల షేర్ సాధించింది. ఈ రికార్డ్ ని కల్కి అధికమిస్తుందా అనే చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్ల వరకు ఉండబోతోందని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఫుల్ రన్ లో ఏపీ తెలంగాణాలో 250 కోట్ల పైగా వసూళ్లు రాబట్టింది. ఇది కూడా కల్కి ముందున్న లక్ష్యమే. 

 

77

ఇక ప్రభాస్ అభిమానులు తప్పనిసరిగా సాధించాలి అని ఎదురుచూస్తున్న మరో రికార్డ్ 1000 కోట్ల మార్క్. బాహుబలి తర్వాత ప్రభాస్ తన చిత్రాలతో మరోసారి 1000 కోట్లు అందుకోలేదు. కల్కి ఆ లోటుని పూరించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అందులో ఉన్న స్టఫ్ చూసి కల్కి చిత్రం సాధించబోయే రికార్డుల విషయంలో ఒక క్లారిటీకి రావచ్చు. జూన్ 10న కల్కి ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. 

 

Read more Photos on
click me!

Recommended Stories