కూటమి, వైసీపీ రెండు పార్టీలు గెలుపుపై ఈసారి ధీమాను ప్రదర్శించాయి. జనాలకు కూడా ఎవరు గెలుస్తారు అన్న విషయంలో ఉత్కంటగా చూశారు. దాంతో బెట్టింగ్ లు జోరు అందుకున్నాయి. వేలు, లక్షలు, కోట్లు, ఆస్తులు పందెంగా పెట్టినవారు కూడా ఉన్నారట. అంతే కాదు వ్యక్తి పరంగా కూడా పవర్ కళ్యాణ్ గెలుపు ఓటములపై కూడా పందాలు గట్టిగానే వేసుకున్నారు. దాంతో ఈసారి రాజకీయం రసవత్తరం అయ్యింది.