పూరి జగన్నాధ్ భార్య సంస్కారానికి నందమూరి హరికృష్ణ ఫిదా.. జీవితాంతం మరచిపోలేను అంటూ..

Published : Jun 06, 2024, 08:18 PM IST

హరికృష్ణ కుమారుడు నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఇజం చిత్రం సమయంలో ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఈవెంట్ లో హరికృష్ణ పూరి జగన్నాధ్ సతీమణి లావణ్య గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

PREV
16
పూరి జగన్నాధ్ భార్య సంస్కారానికి నందమూరి హరికృష్ణ ఫిదా.. జీవితాంతం మరచిపోలేను అంటూ..

నందమూరి హరికృష్ణ ముక్కుసూటి వ్యక్తి అనే విషయం అందరికి తెలుసు. హరికృష్ణ ప్రమాదంలో మరణించి చాలా ఏళ్ళు గడుస్తోంది. కానీ ఆయన గురించి తరచుగా అభిమానులు చర్చించుకుంటూనే ఉంటారు. హరికృష్ణ తనతో ఉన్న వారిని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు అని అంటుంటారు. తనకు చేతనైన సహాయం చేస్తుంటారు. సహాయం చేసిన వారిని మరచిపోరు. 

26
NTR

హరికృష్ణ కుమారుడు నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఇజం చిత్రం సమయంలో ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇజం చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది. ఈ చిత్రానికి సంబంధించిన ఈవెంట్ లో హరికృష్ణ పూరి జగన్నాధ్ సతీమణి లావణ్య గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 

36

ఒక సినిమా నిర్మాణం అంటే మామూలు విషయం కాదు. ఆఫీస్ బాయ్ కూడా ఒక చిత్రానికి చాలా ఉపయోగపడతారు. ఆఫీస్ బాయ్ ఇచ్చేమంచి టీతో మన ఎనేర్జి పెరుగుతుంది. డ్రైవర్ మనల్ని ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి జాగ్రత్తగా తీసుకుని వెళ్తాడు. నేను మా నాన్న గారికి డ్రైవర్ గా రథ సారధిగా పనిచేశాను. 

46

ఇజం చిత్రం జరుగుతున్న సమయంలో నేను పూరి జగన్నాధ్ గారి ఇంటికి ఒకసారి వెళ్ళాను. ఆయన సతీమణి లావణ్య నాకు నమస్కరించి చాలా ఆప్యాయంగా పలకరించారు. ఏం తీసుకుంటారు సార్ అని అడిగారు. కాఫీ తీసుకుంటాను అమ్మా అని చెప్పా. 

56

ఎంతో అద్భుతమైన కాఫీ ఆమె నాకు ఇచ్చారు. నేను జీవితంలో మరచిపోలేను అని హరికృష్ణ అన్నారు. పక్కనే ఉన్న పూరి జగన్నాధ్.. కాఫీ ఇచ్చినందుకు కూడా ఇంతలా పొగడలా అన్నట్లుగా చూశారు. దీనితో హరికృష్ణ నేను ఆమెకి కృతజ్ఞత చెప్పుకోవాలి. నేను నా మనసులో అనిపించింది చెప్పేస్తాను. దాచుకొను. దాచులేను.

66

జీవితంలో ఎన్ని దెబ్బలు తగిలినా ఎవడికీ తలవంచను. కృతజ్ఞత మాత్రం తెలియజేస్తా. తలవంచే వాడిని అయితే ఎన్టీఆర్ కడుపునా పుట్టేవాడిని కాదు అని ఎమోషనల్ అయ్యారు. 

click me!

Recommended Stories