600 కోట్ల సినిమా తీసి.. సింపుల్ గా 10 లక్షల కారులో తిరుగుతున్న డైరెక్టర్.. గ్రేట్ కదా..?

First Published Jun 14, 2024, 4:55 PM IST

అతను చూడటానికి బక్కగా ఉంటాడు కాని.. టాలెంట్ మాత్రం కొండంత. వందల కోట్ల సినిమాలు హ్యాండిల్ చేస్తున్నాడు కాని.. ఉండటం మాత్రం సింపుల్ గా ఉంటాడు. కోట్లు పెట్టి కొన్న కారులో తిరగాల్సిన డైరెక్టర్ సింపుల్ గా 10 లక్షల కారులో కనిపిస్తున్నాడు. ఇంతకీ ఎవరతను. 
 

మనిషిని బట్టి ఎప్పుడూ వారి టాలెంట్ ను.. లెవల్ ను అంచనా వేయకూడదు. వారి స్థాయిని కూడా అంచనా వేయకూడదు. సరిగ్గా ఇదే మాటలు వర్తిస్తాయి ఓ దర్శకుడికి వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తూ.. చాలా సింపుల్ లైఫ్ స్టైల్ ను కలిగి ఉన్నాడు ఆదర్శకుడు ఇంతకీ ఎవరతను.. ఏం సినిమాలు చేస్తున్నాడు. 

అతను ఎవరో కాదు.. నాగ్ అశ్విన్..  టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత హాలీవుడ్‌ ను కూడా మనవైపు తిప్పుకోగలిగే దర్శకుడు కాబోతున్నాడు నాగ్ అశ్వీన్. అతనిపై అంత నమ్మకం తెలుగు జనాలకు. ఎందుకుంటే.. బయెపిక్ మూవీస్ భారీ హిట్ సాధించిన సందర్భాలు చాలా తక్కువ. అటువంటిది మహానటి సావిత్రి బయోపిక్ ను అందమైన దృశ్య కావ్యంగా మలిచి.. ఈతరం జనాలకు కూడా ఆమెపై గౌరవాన్ని పెంచిన దర్శకు నాగ్ అశ్వీన్. 

అల్లు అర్జున్ - జూనియర్ ఎన్టీఆర్ ను మెగా‌- నందమూరి ఫ్యామిలీలు దూరం పెట్టాయా..? కోల్డ్ వార్ కు కారణం ఏంటి..?

అంతే కాదు.. ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా కల్కీతో థియేటర్లలోకి రాబోతున్నాడు దర్శకుడు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈసినిమా ట్రైలర్ కు ఎంత రెస్పాన్స్ వచ్చింది అనేవిషయం అందరికి తెలిసిందే. ఇన్నాళ్లుగా మార్వెల్, డీసీ సినిమాలు చూసి ఎలా తీస్తార్రా బాబు హాలీవుడ్ వాళ్లఉ  ఇలాంటిసినిమాలు అనుకున్న మనకు.. మన టాలీవుడ్ డైరెక్టర్ కూడా ఇలాంటి సినిమా తీయ్యగలడు అని నిరూపించబోతున్నాడు నాగ్ అశ్వీన్. కల్కీ ట్రైలర్ చూస్తే.. ఎవరికైనా ఈ అభిప్రాయం కలగక మానదు.

నాగార్జున ఆ హాట్ హీరోయిన్ తో.. ఒక్క సినిమా కూడా చేయకపోవడానికి కారణం ఏంటి..?

కల్కి ట్రైలర్ అలాంటి హ్యాంగోవర్ ను అందించింది అందరికి. ఈసినిమా కోసం భారీ గా బడ్జెట్ కూడా పెట్టారు. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో ..హాలీవుడ్ టెక్నీఫియన్స్ తో సినిమా ను డ్రైవ్ చేస్తున్నాడు నాగ్ అశ్వీన్. అయితే ఈ రేంజ్ సినిమా తీస్తూ.. భారీ సినిమాలు నిర్మించే బడానిర్మాత అల్లుడు అయిన నాగ్ అశ్వన్.. ఎప్పుడూ ఆడంబరాలకు వెళ్ళాడు.. భారీ కార్లు.. కాస్ట్రీ లైఫ్ ను కోరుకోడు. చాలా సింపుల్ గా.. ఓ మధ్యతరగతి వ్యక్తిలా ఉంటాడు. చాలా సింపుల్ గా మెయింటేన్ చేస్తుంటాడు.. 

ఎదైనా ఈవెంట్‌కు వచ్చినా, ప్రోగ్రామ్‌కు వచ్చినా ఇంతే సింపుల్ గా వస్తుంటాడు నాగ్ అశ్విన్. సింపుల్ గా టీషర్ట్స్, నైట్ ప్యాంట్, స్లిప్పర్స్..  లో కనిపిస్తూ.. అందరి మధ్య ఓ ఛాయ్ తాగుతూ.. సరదా కబుర్లు చెపుతూ.. కాళ్లు పైకి పెట్టుకుని కూర్చి.. తనకు నచ్చినట్టుగా ఫ్రీగా ఉంటాడు నాగ్ అశ్వీన్. 

ఒక్క సినిమా చేస్తే చాలు.. అది హిట్ అయినా.. ప్లాప్ అయినా.. గర్వం తలకెక్కి.. కోట్లు పెట్టి పడవల్లాంటి కార్లు వాడుతుంటారు కొంత మంది సినిమా వాళ్లు. కాని నాగ్ అశ్వీన్ అలా కాదు.. 600 కోట్ల సినిమా చేస్తూ కూడా.. సింపుల్ గా 10 లక్షల విలువ చేసే చిన్న కారులో తిరుగుతూ.. ఆశ్చర్యపరు్తున్నాడు. సింపుల్ గా టీషర్ట్స్, నైట్ ప్యాంట్, స్లిప్పర్స్..  లో కనిపిస్తూ.. అందరి మధ్య ఓ ఛాయ్ తాగుతూ.. సరదా కబుర్లు చెపుతూ.. కాళ్లు పైకి పెట్టుకుని కూర్చి.. తనకు నచ్చినట్టుగా ఫ్రీగా ఉంటాడు నాగ్ అశ్వీన్. 
 

 ఇక ఎన్నో ఏళ్ల నుంచి ఎదరుచూస్తున్న కల్కి సినిమా రిలీజ్ కు టైమ్ దగ్గర పడింది. ఈ సినిమాను జూన్ 27న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు టీమ్. ఇప్పటికే  ప్రమోషన్స్ కు పదును పెట్టారు కల్కీ బ్యాచ్. అమెరికాలో అడ్వాన్స్ సేల్స్ స్టార్ట్ అవగా.. టిక్కెట్‌లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అప్పుడు ఆర్ఆర్ఆర్ రికార్డును కూడా బ్రేక్ చేసి.. ఫాస్టెస్ట్ 1మిలియన్ సేల్స్ గా రికార్డు క్రియేట్ చేశాడు. అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ వంటి స్టార్స్ ఈసినిమాలో నటిస్తుండటంతో.. మూవీపై భారీగాఅంచనాలు ఏర్పడ్డాయి. 

Latest Videos

click me!