క్రేజీ.. పవర్ స్టార్ కి ప్రభాస్ సర్ప్రైజ్.. పవన్, సుజీత్ మూవీపై అదిరిపోయే కామెంట్

Published : Dec 04, 2022, 05:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. పవన్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నాడు. 

PREV
16
క్రేజీ.. పవర్ స్టార్ కి ప్రభాస్ సర్ప్రైజ్.. పవన్, సుజీత్ మూవీపై అదిరిపోయే కామెంట్
Pawan Kalyan - sujeeth movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. పవన్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీ చేయాల్సి ఉంది. అయితే భవదీయుడు చిత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. 

26

ఇంతలోనే పవన్ ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ లాంటి అప్డేట్ ఈ ఉదయం వచ్చింది. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో నటించేందుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పవన్, సుజీత్ ల చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత డివివి దానయ్య నిర్మించబోతున్నారు. ఈ సూపర్ అప్డేట్ ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేయగా.. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో తుఫాన్ సృష్టిస్తోంది. 

36

కాన్సెప్ట్ పోస్టర్ లోనే సుజీత్ ఎన్నో కిక్కిచ్చే అంశాలు జోడించారు. పోస్టర్ రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ చేసి ఉంది. పవన్ కళ్యాణ్ నిలబడి ఉండగా అతడి షాడోని గన్ లాగా చూపించారు. పవన్ పాత్రని OG అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని పిలుస్తున్నారు. ఇక పోస్టర్ పై జాపనీస్ భాషలో ఏదో రాసి ఉంది. జాపనీస్  భాషలో రాసి ఉన్న ఆ పదానికి అర్థం 'అగ్నితుఫాను రాబోతోంది' అని. మొత్తంగా అనౌన్సమెంట్ తోనే సుజీత్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఆసక్తి పెంచేశాడు. 

46

ఇదిలా ఉండగా పవన్ , సుజీత్ కాంబినేషన్ పై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పందించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇంస్టాగ్రామ్ లో పవన్ మూవీని ఉద్దేశిస్తూ ప్రభాస్ పోస్ట్ చేశాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, డైరెక్టర్ సుజీత్ కి కంగ్రాట్స్. ఈ కాంబినేషన్ ఒక విస్ఫోటనం లా మారడం ఖాయం. దానయ్య గారికి , చిత్ర యూనిట్ కి నా బెస్ట్ విషెస్ అంటూ ప్రభాస్ పోస్ట్ చేశాడు. 

 

56

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ సాహో చిత్రంలో నటించాడు. సుజీత్ ప్రభాస్ ని ఈ మూవీలో సూపర్ స్టైలిష్ గా చూపించాడు. కానీ బాహుబలి తర్వాత అంచనాలు విపరీతంగా పెరిగిపోవడం, బడ్జెట్ కంట్రోల్ లో లేకపోవడంతో సాహో మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. 

66

సాహో తర్వాత సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇదే. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రభాస్ తన దర్శకుడిని గుర్తుంచుకున్నాడు. ఇక పవన్, సుజీత్ కాంబినేషన్ గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. తేరి రీమేక్ ని సుజీత్ పవన్ తో తెరకెక్కించబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. కానీ అది వాస్తవం కాదు. సుజీత్ ఒరిజినల్ స్క్రిప్ట్ తోనే అదిరిపోయే యాక్షన్ మూవీ తెరకెక్కించబోతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories