చిరంజీవి గారు ఆశ్చర్యపోయారు..పెళ్లిపై, మెగాస్టార్ రెస్పాన్స్ పై ఆదిపురుష్ ప్రీరిలీజ్ లో ప్రభాస్ కామెంట్స్

First Published Jun 6, 2023, 11:13 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ఆదిపురుష్ జూన్ 16న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. దీనితో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఆదిపురుష్ టీం కనీవినీ ఎరుగని విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ఆదిపురుష్ జూన్ 16న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. దీనితో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఆదిపురుష్ టీం కనీవినీ ఎరుగని విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ప్రీరిలీజ్ వేడుకకు ప్రభాస్, కృతిసనన్, ఓం రౌత్ సహా ఆదిపురుష్ టీం మొత్తం హాజరైంది.  

అభిమానులు ప్రభాస్ ప్రసంగం కోసం ఎంతగానో ఎదురు చూశారు. ఫ్యాన్స్ అందరూ కోరుకున్న విధంగా ప్రభాస్ తన స్పీచ్ తో అలరించాడు. జైశ్రీరామ్ జైశ్రీరామ్ అంటూ నినాదాలతో ప్రభాస్ ప్రసంగం ప్రారంభించారు. గత ఎనిమిదినెలలుగా ఓం రౌత్ కి, ఇతర టీంకి నిద్ర కూడా సరిగ్గా లేదు. 

ఓం రౌత్ అయితే కేవలం గంట రెండుగంటలు మాత్రమే పడుకుంటూ ఒక యుద్ధమే చేశారు. ఆదిపురుష్ అనేది కేవలం సినిమా కాదు. ఒక సందర్భంలో చిరంజీవి గారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అడిగారు. ఏంటి రామాయణం చేస్తున్నావా అని.. అవును సర్ అని చెబితే ఈ అదృష్టం అందరికీ దొరకదు అని చెప్పినట్లు ప్రభాస్ ప్రీ రిలీజ్ వేడుకలో గుర్తు చేసుకున్నారు. 

ఓం రౌత్ ఫ్యాన్స్ కోసం ఎంతో కష్టపడ్డారు. వాళ్ళందరి ముఖాలు చూడండి నిద్రలేక ఎలా అయిపోయాయో అని ప్రభాస్ చూపించారు. ఇక ఫ్యాన్స్ పెళ్లి పెళ్లి అని గోల చేస్తుండడంతో.. ప్రభాస్ సమాధానం అందరిలో నవ్వులు పూయించింది. తిరుపతిలోనే చేసుకుంటాలే ఎప్పుడైనా అని చెప్పి ప్రభాస్ నవ్వులు పూయించారు. 

ఈ చిత్రంలో జానకి పాత్రలో నటించిన కృతి సనన్ పై ప్రభాస్ ప్రశంసలు కురిపించారు. చాలా రోజుల తర్వాత జానకి పాత్రకి కృతి సనన్ ని ఎంపిక చేశారు. ఎందుకంటే ఈ పాత్రకి ఒక మంచి అమ్మాయి కావాలి. ఆ మంచి అమ్మాయి కృతి సనన్. నటనతో అదరగొట్టేసింది అని ప్రభాస్ ప్రశంసించారు. 

ప్రీ రిలీజ్ వేడుకకి అతిథులుగా హాజరైన చినజీయర్ స్వామికి, వైవి సుబ్బారెడ్డికి ప్రభాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడుతూ.. సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తా.. కానీ ఇలా వేదికపై తక్కువగా మాట్లాడుతా మీకు ఓకేనా అని సరదాగా తెలిపారు. ఒక వేళ సినిమా లేట్ అయితే అది నా తప్పు కాదు అని ప్రభాస్ అన్నారు. తిరిగి జైశ్రీరామ్ అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు. 

click me!