ప్రభాస్‌ హీరో కాకపోతే ఏమయ్యేవాడో తెలుసా? వందల ఎకరాలు కొని.. రాజు ఎక్కడున్నా రాజే

Published : Oct 23, 2025, 05:44 PM IST

ప్రభాస్‌ ప్రస్తుతం ఇండియా గర్వించదగ్గ హీరోగా ఎదిగారు. గ్లోబల్‌ స్టార్‌గా రాణిస్తున్నారు. మరి డార్లింగ్‌ సినిమాల్లోకి రాకపోతే, హీరో కాకపోతే ఏం చేసేవాడో తెలుసా? రాజు అంటే రాజే.  

PREV
14
ప్రభాస్‌ బర్త్ డే.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

ప్రభాస్‌ నేడు 45వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. దీంతో ఇండస్ట్రీలో, అటు సోషల్‌ మీడియాలో మొత్తం ఆ సందడి నెలకొంది. నెట్టింట ప్రభాస్‌ ట్యాగ్‌ ట్రెండ్ అవుతుంది. మరోవైపు ఆయన సినిమాల అప్‌ డేట్లు ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాయి. `ఫౌజీ` ఫస్ట్ లుక్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. సినిమా కాన్సెప్ట్ ని ప్రతిబింబించేలా ఈ పోస్టర్ ని డిజైన్‌ చేశారు. అది బాగా ట్రెండ్‌ అవుతోంది. మరోవైపు `ది రాజాసాబ్‌` నుంచి కొత్త పోస్టర్‌ వచ్చింది. అది కూడా అలరిస్తోంది. మొత్తంగా గురువారం ప్రభాస్‌ బర్త్ డే ఫ్యాన్స్ కి ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు.

24
ప్రభాస్‌ హీరో కాకపోతే ఏమయ్యేవాడు

అయితే కృష్ణంరాజు నటవారసుడిగా సినిమాల్లోకి వచ్చిన ప్రభాస్‌ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్ గా ఎదిగారు. భారతీయ సినిమాకి ఒక దిక్సూచీగా నిలిచిన విషయం తెలిసిందే. మున్ముందు ఆయన గ్లోబల్‌ స్టార్‌గా రాణించబోతున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే హీరో కాకపోతే ప్రభాస్‌ ఏం చేసేవాడు, ఏ రంగంలో ఉండేవాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయాన్ని ప్రభాస్‌ వెల్లడించారు. తాను సినిమాల్లోకి రాకపోతే ఏం చేసేవాడో వెల్లడించారు. తన అభిరుచిని చాటుకున్నారు ప్రభాస్‌.

34
ఇంటర్మీడియట్‌లోనే హీరో ఫీలింగ్‌

ఇంటర్మీడియట్‌ టైమ్‌లోనే తాను హీరో అనే ఫీలింగ్‌ కలిగిందట. రెగ్యూలర్‌గా సినిమాల షూటింగ్‌లకు వెళ్తుండటం, పైగా హైట్‌ ఎక్కువగా ఉండటంతో అంతా హీరో హీరో అంటుంటే తనకు కూడా అలాంటి ఫీలింగ్‌ కలిగిందని తెలిపారు ప్రభాస్‌. అంతేకాదు మామయ్య ఎంఎస్‌ రాజు ఎప్పుడు కలిసినా హీరో హీరో అనేవాడట. అలా తెలియకుండానే తాను హీరో అనేది మనసులో పడిపోయిందట. పైగా ఫ్రెండ్స్ అంతా హీరోహీరో అంటుంటే అది మరింతగా మనసులో నాటుకుపోయిందన్నారు ప్రభాస్‌. ఆ తర్వాత సత్యానంద్‌ వద్ద నటనలో శిక్షణ తీసుకున్నారు. అనంతరం `ఈశ్వర్‌`తో హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే.

44
హోటల్‌, రెస్టారెంట్ పెట్టాలనుకున్న ప్రభాస్‌

మరి హీరో కాకపోతే ఏం అయ్యేవాడనేదానికి ప్రభాస్‌ స్పందిస్తూ, నాకు విదేశాలకు వెళ్లి ఎంబీఏ చేయాలనుకున్నాడట. అక్కడ స్టడీ అయిపోయాక ఇండియా వచ్చి ఏదైనా హోటల్‌గానీ, రెస్టారెంట్‌గానీ పెట్టాలనే ప్లాన్‌లో ఉన్నాడట. తాను హీరో కాకపోతే ఈ పనిచేసేవాడిని అని తెలిపారు. ప్రభాస్‌ భోజన ప్రియుడు అంటారు. అంతేకాదు సినిమా సెట్‌లో ఆర్టిస్టులు, టెక్నీషియన్లకి అన్నిరకాల వంటకాలు తినిపించడం డార్లింగ్‌కి ఇష్టం. ఆయనతో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్, డైరెక్టర్‌ ఈ విషయాన్ని  చాలా సార్లు తెలిపారు. ఫోటోలు కూడా పంచుకున్న విషయం తెలిసిందే.

సినిమా కాకుండా ఇతర వ్యాపకాల గురించి చెబుతూ, తనకు వ్యవసాయం అంటే ఇష్టమని తెలిపారు. భవిష్యత్ లో ఎక్కడైనా మూడు, నాలుగువందల ఎకరాలు కొనుక్కొని చక్కగా వ్యవసాయం చేయాలని ఉందట. అంతేకాదు తొమ్మిదో తరగతి చదువుకునే సమయంలోనే `ఆక్వా కల్చర్‌`ని చేసినట్టు తెలిపారు. ఇరవై ఏళ్ల వయసులోనే రొయ్యల చెరువు వేసినట్టు తెలిపారు డార్లింగ్‌. ఆయన ఫ్యాన్స్ ఆసక్తికరంగా మారాయి. గతంలో సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు ప్రభాస్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories