కాగా ప్రభాస్-కృతి సనన్ ఎఫైర్ లో ఉన్నారంటూ ఆ మధ్య పుకార్లు షికార్లు కొట్టాయి. ఓ షోలో వరుణ్ ధావన్ చేసిన కామెంట్స్ ఈ రూమర్స్ కి మరింత ఆజ్యం పోశాయి. అయితే కృతి సనన్ ఈ వార్తలను ఖండించింది. తాము కేవలం మిత్రులమే. అంతకు మించి ఎలాంటి బంధం లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది. గతంలో దివంగత నటుడు సుశాంత్ రాజ్ పుత్ తో కూడా కృతి సనన్ ఎఫైర్ నడిపిందనే వాదన ఉంది.