పాండవుల పక్షాన కర్ణుడు, మరోసారి అదే సెంటిమెంట్ తో ప్రభాస్.. 'ఫౌజీ' కథని డీకోడ్ చేస్తున్న నెటిజన్లు, వైరల్

Published : Oct 22, 2025, 07:48 PM IST

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రీ లుక్ తో ఫ్యాన్స్ లో చాలా ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ చిత్ర కథ ఏంటి ? ఇందులో కర్ణుడి అంశం ఎలా ఉండబోతోంది అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 

PREV
15
టైటిల్ పోస్టర్ కి ముహూర్తం ఫిక్స్

 ప్రభాస్ నటిస్తున్న హను రాఘవపూడి దర్శకత్వంలోని పీరియడ్ యాక్షన్ డ్రామా సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గత కొంతకాలంగా ఈ చిత్ర టైటిల్ ఫౌజీ అంటూ ప్రచారం జరుగుతోంది. గురువారం అంటే అక్టోబర్ 23 ఉదయం 11 గంటల 7 నిమిషాలకు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రభాస్ ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రీ లుక్ పోస్టర్ రిలీజైనప్పటి నుంచి ఈ చిత్ర టైటిల్, కథాంశంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రీ లుక్ పోస్టర్ లో డైరెక్టర్ హను రాఘవపూడి కొన్ని ఆసక్తికర డీటెయిల్స్ ఇచ్చారు. 

25
పాండవుల పక్షాన కర్ణుడు 

పోస్టర్‌లో ప్రభాస్ ముఖం చూపించలేదు కానీ ఆయన నడుస్తున్నట్లు ఉన్న ఫ్రేమ్ ఆకట్టుకుంటోంది. పోస్టర్ పై ఒక సంస్కృత వాక్యం ఉంది. పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు అని అర్థం వచ్చేలా ఆ వాక్యం ఉంది. పోస్టర్‌లో కనిపించిన ‘Z’ అక్షరం కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రం  ‘Z’ అనే ఆపరేషన్ కి సంబంధించిన కథతో ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ కూడా ఫిక్స్ అని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. 

35
ఫౌజీ టైటిల్ ఖరారైనట్లేనా ?

కాస్ట్యూమ్ డిజైనర్ షీతల్ ఇక్బాల్ శర్మ ఇన్‌స్టాగ్రామ్ హైలైట్‌లో మూవీ పోస్టర్ ను “Fauzi” అనే పేరుతో సేవ్ చేయడంతో, అభిమానులు ఇది టైటిల్ కన్‌ఫర్మేషన్ అని భావించారు. కర్ణుడి అంశాలని, మహా భారతంలో అంశాలని డైరెక్టర్ హను రాఘవపూడి ఈ చిత్ర కథలో ఎలా మిళితం చేయబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది.

45
బ్రిటిష్, వరల్డ్ వార్ 2 నేపథ్యంలో కథ 

సినిమా నేపథ్యం బ్రిటిష్ కాలం నాటి భారతదేశంలో సైనిక విప్లవానికి సంబంధించినదని సమాచారం. 1940ల నాటి వాతావరణంలో సాగబోయే ఈ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ విప్లవకారుడి పాత్రలో కనిపించనున్నాడు. “ఆపరేషన్ Z” అనే పదం పోస్టర్‌లో ఉండటంతో, ఇది రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన అంశమని అభిమానులు భావిస్తున్నారు. జపాన్ బాంబర్ ప్రాజెక్ట్ లేదా నాజీ జర్మనీ అమెరికాబాంబర్ సిస్టమ్‌లతో పోలిక ఉందని వారు ఊహిస్తున్నారు. ఈ కథలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి సంబంధించిన అంశాలు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి చిత్రం కర్ణుడి సెంటిమెంట్ తోనే సంచలన విజయం సాధించింది. మరి ఇందులో ప్రభాస్ పాత్రలో కర్ణుడి తరహా లక్షణాలు ఎలా ఉంటాయి ? ప్రభాస్ ఎలా నటించబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. 

55
నటీనటులు వీరే 

ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇమాన్వీ హీరోయిన్ గా నటిస్తోంది. మొత్తంగా జస్ట్ ప్రీ లుక్ తోనే ప్రభాస్ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. గురువారం విడుదల కాబోయే టైటిల్ పోస్టర్ లో ఇంకెన్ని డీటెయిల్స్ ఉంటాయో చూడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories