రెండు వేల కోట్ల కలెక్షన్ల సత్తా ఉన్న ప్రాజెక్ట్ లకు ప్రభాస్‌ గ్రీన్‌ సిగ్నల్‌, ఇక ముందున్నదంతా అరాచకమే

First Published | Nov 3, 2024, 11:16 AM IST

ప్రభాస్‌ చేతిలో ఇప్పటికే ఐదు సినిమాలున్నాయి. తాజాగా మరో రెండు సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. అయితే ఇవి రెండు వేల కోట్ల కలెక్షన్ల సత్తా ఉన్న ప్రాజెక్ట్ లని టాక్‌. 
 

ప్రభాస్‌ ఇండియన్‌ సినిమాకి ఫేస్‌ ఆఫ్‌గా నిలిచారు. ఆయన సినిమాలు ఇప్పుడు ప్రపంచ బాక్సాఫీసుని కూడా షేక్‌ చేస్తుండటం విశేషం. `బాహుబలి`తో స్టార్ట్ చేసిన ఆయన `సలార్‌`, `కల్కి 2898 ఏడీ` చిత్రాలతో దాన్ని అమాంతం పెంచేశారు. అంతేకాదు బాక్సాఫీసు కలెక్షన్ల స్థాయిని కూడా పెంచేశాడు. వెయ్యి కోట్లు ఇప్పుడు కామన్‌ అనే స్థాయికి ఇండస్ట్రీ చేరుకుందంటే అది అతిశయోక్తి కాదు. వెయ్యి కోట్లు దాటిన సినిమాల్లో తనవే రెండు ఉన్నాయి. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

ఇప్పుడు చేస్తున్న సినిమాలు కూడా ఈజీగా వెయ్యి కోట్లు పక్కా అనిపించే చిత్రాలే. `ది రాజా సాబ్‌` బాగుంటే ఐదు వందల కోట్లకుపైగానే ఆశించవచ్చు. లేదంటే కష్టమే. మరోవైపు హనురాఘవపూడి మూవీ వెయ్యి కోట్ల మూవీ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. అలాగే సందీప్‌ రెడ్డి వంగా `స్పిరిట్‌` బాగుంటే దుమ్ములేచిపోతుంది. దీన్నుంచి వెయ్యి నుంచి 1500 కోట్ల వరకు ఆశించవచ్చు. అదిరిపోయిందంటే 2వేల కోట్లు కష్టమేమీ కాదు. ఇంకోవైపు `సలార్‌ 2`, `కల్కి 2` చిత్రాలు కూడా వెయ్యి నుంచి రెండు వేల కోట్ల కలెక్షన్లు రాబట్టే చిత్రాలుగా నిలుస్తాయని అంతా భావిస్తున్నారు. ఫ్యాన్స్ కూడా అదే ఆశిస్తున్నారు. 
 


అయితే ఇప్పుడు మరో రెండు వేల కోట్ల కలెక్షన్లు రాబట్టే సత్తా ఉన్నా ప్రాజెక్ట్ లకు ప్రభాస్‌ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడట. రెండూ భారీ సినిమాలే అని తెలుస్తుంది. అందులో ఒకటి ప్రశాంత్‌ వర్మతో ఉంటుందని సమాచారం. ప్రశాంత్‌ వర్మ ఈ ఏడాది `హనుమాన్‌` సినిమాతో మూడు వందలకోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టగలిగాడు, అందరికి షాకిచ్చాడు. ఇప్పుడు `జై హనుమాన్‌`తో వెయ్యి కోట్లు టార్గెట్‌ చేసినట్టు తెలుస్తుంది.

దీంతోపాటు బాలయ్య వారసుడు మోక్షజ్ఞ తేజతోనూ సినిమా చేయబోతున్నారు. అంతేకాదు ప్రభాస్‌తోనూ సినిమా చేయబోతున్నారట. వీరిద్దరి కాంబో లేటెస్ట్ గా ఫిక్స్ అయ్యిందట. ఇక అధికారిక ప్రకటనే రావాల్సి ఉందని తెలుస్తుంది. ప్రభాస్‌తో మైథలాజికల్(సోషియో ఫాంటసీ) మూవీనే చేస్తే బాక్సాఫీసు వద్ద దాన్ని ఆపడం ఎవరితరం కాదు. ఈజీగా రెండు వేల కోట్లు రాసిపెట్టుకోవచ్చు. అంతకు మించి వసూలు చేసిన ఆశ్చర్యం లేదు. 
 

దీంతోపాటు లోకేష్‌ కనగరాజ్‌ తోనూ సినిమా చేయబోతున్నారట. లోకేష్‌ `ఖైదీ`, `విక్రమ్‌`, `లియో` చిత్రాలతో తానేంటో చూపించారు. అంతేకాదు లోకేష్‌ కనగరాజ్‌ సినిమాటిక్‌ యూనివర్స్ ని క్రియేట్‌ చేశారు. ప్రతి సినిమాకి లింక్‌ చేస్తూ తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు రజనీకాంత్‌తో `కూలీ` సినిమా చేస్తున్నారు.

దీనితో వెయ్యి కోట్లు టార్గెట్‌ చేశారు. ఇందులో నాగార్జున కూడా కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. దీంతోపాటు `ఖైదీ 2`, `విక్రమ్‌ 2`, `రోలెక్స్` వంటి సినిమాలు చేయాల్సి ఉంది లోకేష్‌. మరోవైపు లేటెస్ట్ గా ప్రభాస్‌తోనూ ఓ ప్రాజెక్ట్ ఓకే అయ్యిందట. తన సినిమాటిక్‌ యూనివర్స్ లో భాగంగానే ప్రభాస్‌తో మూవీ ఉంటుందని, అయితే ఇందులో అందరు హీరోలు కలిసి(మల్టీస్టారర్‌) ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారని మరోవార్త వినిపిస్తుంది.

ఇదే జరిగితే ఇది బిగ్గెస్ట్ ఇండియన్‌ మూవీ అవుతుందని చెప్పొచ్చు. ఇక కలెక్షన్లని ఊహించడం కూడా కష్టమే. బాక్సాఫీసు వద్ద ఊచకోతగా ఉండబోతుంది. రెండు వేల కలెక్షన్లు ఏం కర్మ అంతకు మించి ఇండియన్‌ బాక్సాఫీసుని షేక్‌ చేసినా ఆశ్చర్యం లేదు. 
 

ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు పూర్తయిన తర్వాత ఈ సినిమాలు ఉండే అవకాశం ఉంది. అంటే ఈ సినిమాలు ప్రారంభం కావడానికి ఇంకా రెండు మూడేళ్లు పడుతుందని చెప్పొచ్చు. ఇక ప్రభాస్‌ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో `ది రాజా సాబ్‌` సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల దీనికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ కొత్త లుక్‌ విడుదలైంది.

ఇందులో రాయల్‌ లుక్‌లో ప్రభాస్‌ కనిపిస్తున్నారు. అదే సమయంలో ఆయన దెయ్యంగా కనిపించనున్నట్టు తెలుస్తుంది. రొమాంటిక్‌ కామెడీ, హర్రర్ ఎంటర్‌టైనర్‌ గా ఈ మూవీ ఉండబోతుందట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో ఏప్రిల్‌ 10న విడుదల కాబోతుంది.  

Read more: పెళ్లై పిల్లలున్నా సరే, ఆ స్టార్‌ హీరోనే కావాలి.. పెద్ద గొడవ చేసిన హీరోయిన్‌ రాశీ

also read: యష్మికి ఓటేస్తే షో చూడటం మానేస్తా, నెటిజన్లు ఫైర్‌.. ఒక్క దెబ్బకి హీరో అయిపోయిన గౌతమ్‌
 

Latest Videos

click me!