రాశీ ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన నటి. హోమ్లీ హీరోయిన్‌గా మెప్పించింది. ఇంటిళ్లిపాదికి దగ్గరయ్యింది. గ్లామర్ హీరోయిన్ల జోరు సాగుతున్న సమయంలో సాంప్రదాయానికి పెద్ద పీఠ వేస్తూ హీరోయిన్‌గా రాణించింది. స్టార్ హీరోయిన్ గా మెప్పించింది. ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది రాశీ.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బాలనటిగానే సినిమాల్లోకి వచ్చింది రాశీ. మద్రాస్‌లో వాహిని స్టూడియో పక్కన రాశీ పేరెంట్స్ టీ షాప్ నడిపించేవాళ్లు. వారి ద్వారా హీరోహీరోయిన్లు, దర్శకులు పరిచయం అయ్యారు. రాశీ చిన్నప్పుడు క్యూట్‌గా ఉండటంతో చైల్డ్ఆర్టిస్ట్ గా పెట్టుకున్నారు. అలా బాలనటిగా అలరించిన ఆమె, ఆ తర్వాత హీరోయిన్‌గా మారింది. అనేక సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే రాశీకి చిన్నప్పట్నుంచి ఓ ఫాంటసీ ఉండేది. అందరికి హీరోయిన్ కావాలనో, డాక్టర్ కావాలనో, ఇంజనీర్ కావాలనో, కలెక్టర్ కావాలనో ఇలా ఏదో ఒకటి అనుకుంటారు.
కానీ రాశీ మాత్రం మంచి భార్య కావాలనుకుందట. ఇంట్లో ఇల్లాలుగా ఉండాలనుకుందట. స్కూల్‌లో తన టీచర్ అడిగితే, మంచి హౌజ్‌వైఫ్ అవుతా అని చెప్పిందట. అప్పుడు అంతా షాక్ అయ్యారు. రాశీ టేస్ట్ కి ఆశ్చర్యపోయారు. కానీ నిజంగానే రాశీలో ఈ పెళ్లి, ఫ్యామిలీకి సంబంధించిన ఇంట్రెస్ట్ ఎప్పుడూ ఉండేదట. టీనేజ్‌కి వచ్చేటప్పటికీ తాను హీరోలపై క్రష్ పెట్టుకునేదట. అలా ఓ స్టార్ హీరోపై క్రష్ పెట్టుకుందట రాశీ.
ఆయన ఎవరో కాదు హీరో వెంకటేష్. ఓ సినిమాలో ఆయన్ని చూసి ఇష్టం పెంచుకుంది. పెళ్లి చేసుకుంటే ఆయన్నే చేసుకోవాలని డిసైడ్ అయ్యిందట. అంతేకాదు ఇంట్లో గొడవ కూడా చేసిందట. వెంకటేష్ హీరో అని, పెళ్లైంది, ఆయనకు పిల్లలు కూడా ఉన్నారని చెప్పినా వినలేదట, కొన్నాళ్లపాట్లు ఇంట్లో మారాం చేసిందట రాశీ. ఆ తర్వాత రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకుంటానని రచ్చ చేసిందట.
ఇలా ఇన్నోసెంట్‌గా ఉండేదట రాశీ. పెళ్లంటే అంత ఇష్టంగా ఉండేది. అంతేకాదు సినిమాలు చేస్తున్న సమయంలో తాను మ్యారేజ్ చేసుకుంటానని, మంచి అబ్బాయిని చూడమని డైరెక్టర్లు, నిర్మాతలకు కూడా చెప్పేందట. ఈ విషయాలను రాశీనే వెల్లడించడం విశేషం. `అలీతో సరదాగా` ప్రోగ్రామ్‌తోపాటు పలు యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకుంది రాశీ. అయితే పెద్దయ్యాక వెంకటేష్‌తో ఒకటి రెండు సార్లు నటించే అవకాశం వచ్చిందని, కానీ సెట్ కాలేదని తెలిపింది. అయితే చివరికి `శీను` సినిమాలో మాత్రం వెంకటేష్‌తో ఐటెమ్ సాంగ్ చేసింది రాశీ.
రాశీ.. `పెళ్లిపందిరి`, `గోకులంలో సీత`, `శుభాకాంక్షలు`, `పండగ`, `సుప్రభాతం`, `మనసిచ్చి చూడు`, `డాడీ డాడీ`, `స్వప్నలోకం`, `కృష్ణబాబు`, `ప్రేయసి రావే`, `పోస్ట్ మ్యాన్`, `మూడు ముక్కలాట`, `అమ్మో ఒకటో తారీకా`, `దేవుళ్లు`, `మా ఆవిడి మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది`, `దీవించండి`, `సందడే సందడి`, `నిజం` వంటి సినిమాలతో నటిగా ఆకట్టుకుంది. స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. `నిజం` తర్వాత ఆమె హీరోయిన్‌గా తెలుగులో సినిమాలకు గుడ్ బై చెప్పింది.
ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేసి ఇక మ్యారేజ్ చేసుకుంది. అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీముణిని ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలు మానేసిన ఆమె కొన్నాళ్లు గ్యాప్ తీసుకుని ఇటీవల మళ్లీ సినిమాలు చేస్తుంది. అడపాదడపా మూవీస్‌లో మెరుస్తుంది. కాకపోతే చాలా సెలక్టీవ్‌గా వెళ్తుంది. దీంతోపాటు వెబ్ సిరీస్‌లు, సీరియల్స్ లోనూ నటిస్తూ బిజీగా ఉంది రాశీ.
Read more: పవన్ కళ్యాణ్, సౌందర్య చేయాల్సిన సినిమా ఏంటో తెలుసా? ఎలా మిస్ అయ్యింది? పవన్ భయపడ్డాడా?
Also read: యష్మికి ఓటేస్తే షో చూడటం మానేస్తా, నెటిజన్లు ఫైర్.. ఒక్క దెబ్బకి హీరో అయిపోయిన గౌతమ్