ఫస్ట్ టైమ్‌ ప్రభాస్‌ని పోస్టర్‌పై చూసి ఎన్టీఆర్‌ రియాక్షన్‌ ఏంటో తెలుసా? తారక్‌ చెప్పిన మాటకి నిర్మాత షాక్‌

First Published | Oct 26, 2024, 6:56 PM IST

ప్రభాస్‌ `ఈశ్వర్‌` సినిమాతో హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఫస్ట్ టైమ్‌ పోస్టర్‌పై ప్రభాస్‌ని చూసి ఎన్టీఆర్‌ చెప్పిన మాటకి షాక్ అయ్యాడట నిర్మాత. 
 

డార్లింగ్‌ ప్రభాస్‌ ఇటీవలే తన 45వ పుట్టిన రోజు జరుపుకున్నారు. వరుస సక్సెస్‌ లో ఉన్న ప్రభాస్‌ ఈ బర్త్ డేని చాలా స్పెషల్‌గా చేసుకున్నారు. ఫ్యాన్స్ హంగామా వేరే లెవల్‌లో సాగిందని చెప్పొచ్చు. అయితే ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన ఫస్ట్ సినిమా `ఈశ్వర్‌`ని రీ రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వైరల్‌ అవుతుంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

`ఈశ్వర్‌` సినిమాతో టాలీవుడ్‌కి హీరోగా పరిచయం అయ్యారు ప్రభాస్‌. అయితే ఆయన ఎంట్రీ అనుకోకుండా జరిగింది. కృష్ణంరాజు తన గోపీకృష్ణ మూవీస్‌ బ్యానర్‌లో ప్రభాస్‌ని గ్రాండ్‌గా పరిచయం చేయాలనుకున్నారు. అందుకోసం వైజాగ్‌ సత్యానంద్‌ వద్ద నటనలో శిక్షణ ఇప్పించారు. ఆ సమయంలోనే దర్శకుడు జయంత్‌ సి పరాంజీ, నిర్మాత అశోక్‌ కుమార్‌ ఆయన్ని పరిచయం చేయాలనుకుంటున్నట్టు కృష్ణంరాజు వద్ద చెప్పడంతో ఆయన ఓకే చెప్పాడు. దీంతో అనుకోకుండా `ఈశ్వర్‌` సినిమా సెట్‌ అయ్యింది. మాస్‌ కమర్షియల్‌గా రూపొందిన ఈ మూవీ మంచి ఆదరణ పొందింది. కానీ సూపర్‌ హిట్‌ అయితే కాదు. 
 


ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ పోస్టర్‌ విడుదలైనప్పుడు అంతా షాక్‌ అయ్యారట. పోస్టర్‌లో ప్రభాస్‌ ఇలా రెండు చేతులు చాచి హీరోయిన్‌ని ఎత్తుకుని ఉన్న సీన్‌ కి అంతా ఫిదా అయిపోయారు. టాలీవుడ్‌కి భారీ కటౌట్‌ రాబోతుందని అన్నారట. అయితే ఈ సినిమా నిర్మాత అశోక్‌ కుమార్‌కి జూ ఎన్టీఆర్‌ మంచి ఫ్రెండ్‌. వీళ్ల మధ్య ఏదో డిస్కషన్‌ జరుగుతున్న సమయంలోనే ఈ పోస్టర్ చూశారట ఎన్టీఆర్‌. దీంతో అన్నా మంచి హీరోని లాంచ్‌ చేశావన్నా అన్నాడట. తాను షాక్‌ అయ్యాడట. 
 

ఎందుకంటే ఎంత ఉన్నా ఓ హీరోని, మరో పొగడమనేది చాలా తక్కువ. వాళ్ల మధ్య పోటీ ఉంటుంది. పోటీగా భావిస్తారు. అలాంటిది ఎన్టీఆర్‌.. అన్నా మంచి హీరోని లాంచ్‌ చేస్తువన్నా, పెద్ద రేంజ్‌ హీరో అవుతాడు. ఇండస్ట్రీకి ఒక అజానుభావుడులాంటి హీరోని పరిచయం చేస్తున్నావ్, గుడ్‌ ఛాయిస్‌ బాబాయ్‌ అని అన్నాడట. ఎన్టీఆర్‌ చెప్పిన ఆ మాటకు నిర్మాత అశోక్‌ కుమార్‌ షాక్‌ అయ్యారట. ఒక హీరో, మరో హీరో గురించి ఇలా మాట్లాడటం, ఎంతో స్పోర్టీవ్‌గా అనిపించిందని, అది చాలా తక్కువ మందిలో ఉండే రేర్‌ క్వాలిటీ అని చెప్పారు అశోక్‌ కుమార్‌. ఎన్టీఆర్‌ చెప్పినట్టే పెద్ద హీరో అయ్యాడని, గ్లోబల్‌ స్టార్‌ అయ్యారని తెలిపారు అశోక్‌ కుమార్‌ చెప్పడం విశేషం. 
 

`ఈశ్వర్‌` సినిమాతో హీరోగా పరిచయం అయిన ప్రభాస్‌ `వర్షం` సినిమాతో తొలి బ్రేక్‌ అందుకున్నారు. `ఛత్రపతి` సినిమాతో స్టార్‌ అయిపోయాడు. ఆ తర్వాత వరుస పరాజయాలను ఫేస్‌ చేసిన ప్రభాస్‌ `డార్లింగ్‌`, `మిస్టర్‌ పర్‌ఫెక్ట్` చిత్రాలతో ఊరట పొందాడు. `మిర్చి` సినిమాతో సూపర్‌ స్టార్‌ అయిపోయారు. `బాహుబలి` సినిమాలతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు. `సలార్‌`, `కల్కి 2898 ఏడీ` సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా ఇండియా సత్తాని, తెలుగు సినిమా సత్తాని చాటి చెప్పాడు డార్లింగ్‌. ప్రస్తుతం ఆయన చేతిలో భారీ సినిమాలున్నాయి. ప్రస్తుతం `ది రాజా సాబ్‌` తెరకెక్కుతుంది. మరోవైపు హనురాఘవపూడితో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే `స్పిరిట్‌`, `సలార్‌ 2`, `కల్కి 2` సినిమాలు చేయాల్సి ఉంది. 

read more: `బిగ్‌ బాస్‌ తెలుగు 8` లోకి వీజే సన్నీ.. వైల్డ్ కార్డ్ ఎంట్రీకి మాజీ విన్నర్‌ ? క్రేజీ డిటెయిల్స్
 

Latest Videos

click me!