అఘోర తరహాలో ప్రభాస్ గెటప్ ఉంది. మెడలో రుద్రాక్ష మాలలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ గెటప్ లో దైవత్వం కనిపిస్తోంది. దైవ సంరక్షకుడిగా ప్రభాస్ ఈ పాత్రలో నటిస్తున్నారు. ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఈ పాత్రలో ఎలివేషన్ ఇచ్చారు. ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పాలకుడు అని పోస్టర్ లో ఉంది. తప్పకుండా ప్రభాస్ పాత్ర కన్నప్ప చిత్రానికి పాజిటివ్ అవుతుంది అని చెప్పడం లో సందేహం లేదు.