Allu Aravind comments on Game Changer Flop: మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం ఇంత పెద్ద డిజాస్టర్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇటు రాంచరణ్, అటు శంకర్ కెరీర్ లో పెద్ద ఫ్లాప్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
Allu Aravind comments on Game Changer Flop: మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం ఇంత పెద్ద డిజాస్టర్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇటు రాంచరణ్, అటు శంకర్ కెరీర్ లో పెద్ద ఫ్లాప్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దిల్ రాజుకి కూడా అంతే.. ఆయన నిర్మించిన అతి భారీ బడ్జెట్ చిత్రం ఇదే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో కూడా పెద్ద ఫ్లాప్ ఈ చిత్రమే.
25
Dil Raju, Game Changer Movie
శంకర్ గత చిత్రాల కంటే గేమ్ ఛేంజర్ పర్వాలేదు. కానీ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. పైగా ఆర్ఆర్ఆర్ తర్వాత ఫ్యాన్స్ రాంచరణ్ నుంచి ఇలాంటి నార్మల్ మూవీని ఆశించలేదు. దీనితో భారీ అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్ కి నిరాశ తప్పలేదు. ఏది ఏమైనా గేమ్ ఛేంజర్ కథ ముగిసింది. చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంపై ఫోకస్ పెట్టారు. ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.
35
అయితే నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దిల్ రాజు కూడా అతిథిగా హాజరయ్యారు. దిల్ రాజు, అల్లు అరవింద్ ఒకేసారి వేదికపైకి వెళ్లారు. దిల్ రాజు ప్రసంగించే ముందు అల్లు అరవింద్ మాట్లాడారు. దిల్ రాజు సంక్రాంతికి రిలీజ్ చేసిన చిత్రాల గురించి అల్లు అరవింద్ ప్రస్తావిస్తూ పరోక్షంగా గేమ్ ఛేంజర్ పై సెటైర్లు వేశారు.
45
Game Changer, Ramcharan
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ మధ్యనే సంక్రాంతికి దిల్ రాజు ఒక చరిత్ర సృష్టించారు. ఒక సినిమానేమో ఇలా తీసుకువెళ్లి అంటూ నేల వైపు చూపించారు. మరో సినిమాని అలా తీసుకువెళ్లారు అంటూ ఆకాశం వైపు చూపించారు. నేల వైపు తీసుకువెళ్లిన చిత్రం గేమ్ ఛేంజర్.. ఆకాశం వైపు తీసుకువెళ్లిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం అని ఆయన ఉద్దేశం. అల్లు అరవింద్ వ్యాఖ్యలతో దిల్ రాజు పగలబడి నవ్వారు.
55
కానీ అల్లు అరవింద్ కామెంట్స్ మాత్రం మెగా అభిమానులకు షాకింగ్ గా మారాయి. గేమ్ ఛేంజర్ చిత్రం గురించి ఆయన ప్రస్తావించిన విధానం అవమానకరంగా ఉందని అంటున్నారు. అదే విధంగా దిల్ రాజు ఐటీ అధికారులని కూడా రప్పించారు అంటూ అల్లు అరవింద్ సెటైర్లు వేశారు. దిల్ రాజు మాట్లాడుతూ జనవరిలో మేము కొట్టాం.. ఫిబ్రవరిలో మీరు కొడుతున్నారు అంటూ అల్లు అరవింద్ కు శుభాకాంక్షలు తెలిపారు.