ఇక ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సందీప్ వంగా గురించి చైతన్య మాట్లాడుతూ.. తన సినిమాలే కాదు, సందీప్ వంగా ఇంటర్వ్యూల్లో మాటలు కూడా ఎంతో నిజాయతీగా, వాస్తవికంగా ఉంటాయన్నాడు. సందీప్ ఈ వేడుకకి రావడం ఆనందంగా ఉంది. ఈ దర్శకులతో, ఈ నిర్మాతలతో కలిసి సినిమా చేయాలని ప్రతి నటుడి దగ్గర ఓ జాబితా ఉంటుంది. అలాంటి నా జాబితాలో గీతా ఆర్ట్స్ పేరు మొదట్లో ఉంటుంది. ఈ సంస్థలో పనిచేస్తే ప్రతి నటుడికీ మంచి ఫలితం లభిస్తుంది. బన్నీ వాస్‌తో నా ప్రయాణం ఎప్పట్నుంచో మొదలైందని చెప్పుకొచ్చాడు.
తండేల్ సినిమాలో రాజు పాత్రకి, తన నిజ జీవితానికీ చాలా వ్యత్యాసం ఉందన్న నాగచైతన్య.. ఈ పాత్రకి తగ్గట్టుగా మారిపోవడానికి తనకు కావల్సినంత సమయం ఇచ్చారని, ఎంతో ఓపికగా నాతో కలిసి ప్రయాణం చేశారన్నాడు. మరి చాలా రోజుల తర్వాత ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్న నాగచైతన్య తండేల్ మూవీతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.