ఆ తర్వాత ప్రభాస్ కృష్ణవంశీ దర్శకత్వంలో చక్రం మూవీలో నటించారు. వైవిధ్యమైన కథలో నటించాలనే ఉద్దేశంతో ప్రభాస్ కంప్లీట్ గా రాంగ్ స్టెప్ వేశారు. ఈ సినిమాలో ఎమోషనల్ డోస్ ఎక్కువైంది. అసలు ప్రభాస్ నుంచి ఇలాంటి సినిమా ఆడియన్స్ ఊహించలేదు. ఫలితంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది.
తొలి 5 సినిమాల్లో ప్రభాస్ కి వర్షం చిత్రంతో మాత్రమే విజయం దక్కింది. మిగిలిన నాలుగు చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి. అయినప్పటికీ ఆడియన్స్ లో ప్రభాస్ పై అంచనాలు పడిపోలేదు. వర్షం లాంటి సూపర్ హిట్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్, అతడి కటౌట్, బాడీ లాంగ్వేజ్ ప్రభాస్ ఇమేజ్ ని కాపాడాయి.