ప్రభాస్ 'ఫౌజి'లో గూస్ బంప్స్ తెప్పించే భారీ ఎపిసోడ్, హాలీవుడ్ నటుడు రంగంలోకి.. థియేటర్స్ లో విధ్వంసమే  

Published : Feb 23, 2025, 12:51 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు. రాజా సాబ్, ఫౌజి చిత్రాల షూటింగ్ జరుగుతోంది.సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ షూటింగ్ కూడా  త్వరలో ప్రారంభం కానుంది.

PREV
14
ప్రభాస్ 'ఫౌజి'లో గూస్ బంప్స్ తెప్పించే భారీ ఎపిసోడ్, హాలీవుడ్ నటుడు రంగంలోకి.. థియేటర్స్ లో విధ్వంసమే  
Hanu Raghavapudi, Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు. రాజా సాబ్, ఫౌజి చిత్రాల షూటింగ్ జరుగుతోంది.సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ షూటింగ్ కూడా  త్వరలో ప్రారంభం కానుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజి చిత్రం భారీ బడ్జెట్ లో రూపొందుతోంది. బ్రిటిష్ నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతున్నట్లు సమాచారం. 

24
Prabhas, Fauji, Hanu Raghavapudi

ప్రీ లుక్ పోస్టర్ కూడా బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులని ప్రతిబింబించేలా చూపించారు. ఈ మూవీలో ప్రభాస్ సైనికుడిగా నటిస్తున్నట్లు టాక్. అయితే ఫౌజి గురించి అదిరిపోయో అప్డేట్ వైరల్ గా మారింది. ఈ చిత్రంలో హను రాఘవపూడి తెలంగాణ నేపథ్యంలో రజాకార్లకి సంబంధించిన భారీ ఎపిసోడ్ ఒకటి ప్లాన్ చేశారట. చిత్రంలో ఈ సన్నివేశం అత్యంత కీలకంగా భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్, ఎమోషనల్ అంశాలతో ఈ సన్నివేశం ఉంటుంది. 

34
Prabhas, Hanu Raghavapudi

ఈ ఎపిసోడ్ కి చిత్ర యూనిట్ మొత్తం సిద్ధం అవుతోంది. వెండి తెరపై ఈ సీన్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉండాలని రాఘవపూడి టార్గెట్ గా పెట్టుకున్నారట. మార్చిలో ఈ సన్నివేశానికి సంబంధించిన షూటింగ్ జరగనుంది. మరో క్రేజీ అప్డేట్ ఏంటంటే ఈ సన్నివేశం కోసం ప్రముఖ హాలీవుడ్ నటుడిని రంగంలోకి దించుతున్నారట. ఆ హాలీవుడ్ నటుడు కొన్ని నెలలుగా ఈ చిత్రం కోసం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అతడి గురించి వివరాలు బయటకి రానున్నాయి. 

44

ఈ మూవీలో సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. సీతారామం తర్వాత హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న మరో పీరియాడిక్ చిత్రం ఇది. 

Read more Photos on
click me!

Recommended Stories